AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: మరోసారి హిట్ కాంబో రిపీట్.. రవితేజ.. గోపీచంద్ మలినేని మూవీ పై బ్లాస్టింగ్ అప్డేట్స్..

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్- మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టారు. గతంలోవ వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు క్రాక్ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మ్యాసీ కాంబో- #RT4GM కోసం నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. పవర్ పుల్ కథతో రూపొందించనున్నారు.

Ravi Teja: మరోసారి హిట్ కాంబో రిపీట్.. రవితేజ.. గోపీచంద్ మలినేని మూవీ పై బ్లాస్టింగ్ అప్డేట్స్..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2023 | 5:59 PM

Share

మాస్ మాహారాజా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తన హిట్ కాంబోను రిపీట్ చేయబోతున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్- మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టారు. గతంలోవ వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు క్రాక్ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మ్యాసీ కాంబో- #RT4GM కోసం నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. పవర్ పుల్ కథతో రూపొందించనున్నారు. కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్‌ ద్వారా సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో ఆ పోస్టర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు. అంటే గురువారం మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో అతని పాత్ర డిఫరెంట్ అండ్ మెమరబుల్ గా ఉండబోతుంది. ఈ సినిమాలో నటించే నటీనటుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. రవితేజ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పాత్రలో నటించనున్నారు. ఇందులో కొంతమంది సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం పని చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలైన టైగర్ నాగేశ్వర రావు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు కంటే 5, 6 వ రోజు కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగులోనే కాకుండా హిందీ సహా కన్నడలోనూ మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుక్ మై షోలో టైగర్ నాగేశ్వర రావు భారీ జంప్ ఈ సినిమాను రిజిస్టర్ చేయడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.