Kajal Aggarwal: అయ్యో పాపం కాజల్.. సినిమా హిట్ అయినా నో యూజ్!
యంగ్ హీరోల సినిమాలో అవకాశాలు రాకపోవటంతో సీనియర్స్ తో జోడి కడుతున్నారు కాజల్. కానీ ఆ ఛాన్సులు కూడా పెద్దగా వర్కవుట్ కావటం లేదు. దాదాపు ఆరేళ్ల తరువాత భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్నారు కాజల్. బాలయ్య హీరోగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ కాజల్ అగర్వాల్. ఈ జనరేషన్ హీరోలతోనూ వరుస సినిమాలు చేసిన చందమామ మెగా కాంపౌడ్ లో అందరు హీరోల తోనూ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆఫ్టర్ మ్యారేజ్ సీన్ మారింది. అమ్మ అయ్యాక లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ, చాలా కాలంగా తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు.
యంగ్ హీరోల సినిమాలో అవకాశాలు రాకపోవటంతో సీనియర్స్ తో జోడి కడుతున్నారు కాజల్. కానీ ఆ ఛాన్సులు కూడా పెద్దగా వర్కవుట్ కావటం లేదు. దాదాపు ఆరేళ్ల తరువాత భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్నారు కాజల్. బాలయ్య హీరోగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.
అయితే ఈ సినిమా కాజల్ కెరీర్ కు మాత్రం అస్సలు ఉపయోగపడలేదు. ఈ సినిమాలో హీరోయిన్ కు తక్కువ సపోర్టింగ్ రోల్ కు ఎక్కువ అనిపించే రేంజ్ క్యారెక్టర్ ప్లే చేశారు కాజల్. పేరుకు హీరోయిన్ అయిన ఇంపార్టెన్స్ ఉన్న సీన్ ఒక్కటి కూడా లేకపోవటంతో థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ కు అసలు కాజల్ ఉందన్న విషయం కూడా గుర్తుండటం లేదు.
ఈ సిచ్యుయేషన్ లో అప్ కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు చందమామ. ప్రజెంట్ ఇండియన్ 2 తో పాటు హిందీలో ఉమ, తెలుగు సత్యభామ సినిమాలు చేస్తున్నారు. ఇండియన్, ఉమ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ కాకపోయినా సత్యభామ మాత్రం కాజల్ సెంట్రిక్ గా తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమానే. ఈ సినిమాతో ఎలాగైన సూపర్ హిట్ అందుకొని తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు కాజల్.
కాజల్ అగర్వాల్ ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram
తనకన్నా ముందే ఇండస్ట్రీకి పరిచయం అయిన తమిళ బ్యూటీ త్రిష, ఇప్పటికీ స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు. మరీ బిజీగా లేకపోయినా తమన్నా కూడా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. కానీ కాజల్ మాత్రం ఆ స్ధాయి లో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో అయినా తిరిగి ఫామ్ లోకి రావలని ఆశపడుతున్నారు చందమామ.
మరిన్ని సినిమా వార్తలు చదవండి