AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్‌పై పిల్లల అభిమానం.. వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన 800 మంది విద్యార్థులు.. వీడియో ఇదిగో

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 02) తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. పవన్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు

Pawan Kalyan: పవన్‌పై పిల్లల అభిమానం.. వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన 800 మంది విద్యార్థులు.. వీడియో ఇదిగో
Pawan Kalyan Birthday
Basha Shek
|

Updated on: Sep 01, 2024 | 4:37 PM

Share

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 02) తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. పవన్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. ఇక సినిమాల పరంగా వస్తే. పవన్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సోమవారం థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పవన్ కల్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈనేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన పురుషోత్తమ్ అనే కళాకారుడు పవన్ కల్యాణ్ పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. స్థానికంగా ఉండే నోబెల్ స్కూల్ అద్వర్యంలో దాదాపు 800 విద్యార్థులు పవన్ కల్యాణ్ ఫొటో ప్రతిబింబించేలా సమహారంగా ఏర్పడి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, జనసైనికుల, కార్యకర్తలు అద్భుతంగా ఉందని కళా కారుడు పురుషోత్తంని అభినందిస్తున్నారు. అలాగే తమ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక పవన్ పుట్టిన రోజున ఆయన సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ సైతం రావచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హరి హర వీర మల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాల షూటింగులు ప్రారంభమయ్యాయి. అయితే పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో షూటింగులకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. త్వరలోనే పవన్ ఈ సినిమా షూటింగులకు హాజరవుతాడని నిర్మాతలకు మాటిచ్చినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ మూడు సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు పవన్. కాబట్టి సోమవారం వీటికి సంబంధించిన టీజర్స్, పోస్టర్స్ ఏవైనా రిలీజ్ కావొచ్చు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు