AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Tips: గ్యాస్ స్టవ్‌తో పనిలేదు.. ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు.. క్షణాల్లో మీకిస్టమైన వంట రెడీ!

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, చాలా చోట్ల సిలిండర్ల కొరత కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలో గ్యాస్ లేకుండానే వంట చేసుకునేందుకు వీలుగా మార్కెట్లోకి చిన్న చిన్న ఎలక్ట్రిక్ కుకింగ్ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది గుడ్స్‌సిటీ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ ట్రావెలింగ్ కుక్కర్. ఇది చూడటానికి ఎలక్ట్రిక్ టీ కెటిల్ లాగా అనిపించినప్పటికీ, ఇందులో అన్ని రకాల వంటు చేసుకోవచ్చు.

Home Tips: గ్యాస్ స్టవ్‌తో పనిలేదు.. ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు.. క్షణాల్లో  మీకిస్టమైన వంట రెడీ!
Electric Multipurpose Cooker
Anand T
|

Updated on: Apr 19, 2026 | 1:38 PM

Share

చూడటానికి ఎలక్ట్రిక్ టీ కెటిల్ లాగా కనిపించే గుడ్స్‌సిటీ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ ట్రావెలింగ్ కుక్కర్‌ను మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒక గ్యాస్ స్టవ్ పై చేసే దాదాపు అన్ని వంటకాలు ఈ కుక్కర్ మనం గ్యాస్ లేకుండానే చేయవచ్చు. ఇందులో కేవలం పాలు, నీళ్లు వేడి చేయడమే కాకుండా.. టీ, కాఫీ, సూప్, నూడుల్స్ వంటివి కూడా వండుకోవచ్చు.బ్యాచిలర్స్, హాస్టల్ విద్యార్థులు, చిన్న గదుల్లో ఉండేవారికి, గ్యాస్ అందుబాటులో లేని సమయంలో అత్యవసరంగా వాడుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనికి ఉన్న మరో బెనిఫిట్ ఏమిటంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది, కాబట్టి ఎటైనా వెళ్లినప్పుడు కూడా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

సామర్థ్యం, పవర్ ఎంత?

ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ సుమారు 1.2 లీటర్ల సామర్థ్యంతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది చిన్న ఫ్యామిలీకి మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు సరిపడా ఆహారాన్ని ఈజీగా వండుకోవచ్చు. ఇది 600 వాట్ల పవర్‌తో పనిచేస్తుంది, ఇది వాటర్ లేదా ఆహారాన్ని త్వరగా వేడి చేస్తుంది. అంతే వండే ఆహారం అడుగుఅంటకుండా దీనిలో వచ్చే పాత్ర నాన్‌స్టిక్‌ కోటింగ్‌తో ఉంటుంది.

ఏమేం వండవచ్చు?

గ్యాస్ స్టవ్ మాదిరి భారీ వంటలు చేయలేకపోయినా, రోజువారీ అవసరాలకు ఇది బాగా పనికొస్తుంది. ఇందులో టీ, కాఫీ తయారు చేయడం, పాలు మరిగించడం, సూప్, నూడుల్స్ లేదా పాస్తా వండటం, గుడ్లు ఉడకబెట్టడం, ఓట్ మీల్ లేదా కిచిడీ వంటి తేలికపాటి వంటలు ఈజీగా చేసుకోవచ్చు.

దీని ధర ఎంత?

ఇక నీది ధర విషయానికి వస్తే సాధారణంగా ఈ రకమైన మల్టీ-కుక్ ఎలక్ట్రిక్ పాట్స్ ధర ఆన్‌లైన్‌లో రూ.1800 నుండి 2000 వరకు ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ డివైజ్ సుమారు రూ. 2000 ధరలో లభిస్తోంది. గ్యాస్ కొరత ఉన్నప్పుడు లేదా సిలిండర్ ధరలు భారంగా అనిపించినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లు మధ్యతరగతి ఉంటే చాలా బాగా యూజ్ అవుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us