రాత్రిపూట మామిడి పండ్లు ఎందుకు తినకూడదు..?

19 April 2026

TV9 Telugu

TV9 Telugu

ఈ కాలంలో రకరకాల మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. పుల్లగా, తియ్యగా.. ఇంకాస్త వగరు రుచిలో ఉండే మామిడి పండ్లు వేడి చేస్తాయని, వాటిని తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి ఫలితంగా మొటిమలొస్తాయని చాలామంది అనుకుంటారు

TV9 Telugu

కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలంటే వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. వంటివన్నీ చర్మ ఆరోగ్యానికి మరింతగా దోహదం చేస్తాయంటున్నారు

TV9 Telugu

అయితే ఇప్పటికే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు వీటిని మరీ ఎక్కువగా తీసుకోకుండా మితంగా తినడం మంచిది. మామిడి పండ్లలో క్యాలరీలు, చక్కెరలు అధిక మొత్తంలో ఉండే మాట వాస్తవమే

TV9 Telugu

అలాగని దాని అర్థం బరువు పెరుగుతామని కాదు. మితంగా తీసుకున్నంత వరకు ఈ పండ్లు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ‘ఎ’, ‘సి’ విటమిన్లు,ఐరన్‌, పొటాషియం, కాపర్‌, బయోయాక్టివ్‌ సమ్మేళనాలు దండిగా ఉంటాయి

TV9 Telugu

కాబట్టి వీటిని పక్కన పెట్టి మామిడి పండ్లు తినాలన్న కోరికను చంపుకోకుండా.. మితంగా ఈ పండ్ల రుచిని ఆస్వాదించమంటున్నారు. చాలామందికి ఉండే సందేహం ఇది. అయితే ఇందులోని పోషకాలు సాధారణ వ్యక్తులకు ఎంత అవసరమో.. గర్భిణులకూ అంతే అవసరం

TV9 Telugu

అయితే ఇప్పటికే అధిక బరువు, జెస్టేషనల్ డయాబీటీస్‌తో  బాధపడే గర్భిణులు వీటిని అమితంగా కాకుండా మితంగా.. అది కూడా పగటి పూట.. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు

TV9 Telugu

ఆహారాన్ని జీర్ణం చేయడం, దాన్ని శక్తిగా మార్చడంలో జీర్ణ వ్యవస్థ ఎంత బిజీగా ఉంటే శరీరంలో అంత వేడి జనిస్తుంది. అంటే వేళాపాళా లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి నమలడం, అమితంగా ఆహారం తీసుకోకూడదని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేతప్ప మామిడి పండ్లు తినడానికి, శారీరక వేడికి సంబంధమే లేదు

TV9 Telugu

మామిడి పండ్లను పూర్తిగా పండిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. అప్పుడే అవి మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఈ పండ్లకు ఎంత గాలి తగిలితే అవి అంత తాజాగా, రుచిగా ఉంటాయి. అందుకే వీటిని ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగుల్లో అస్సలు నిల్వ చేయకూడదు