నానబెట్టిన బాదం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

19 April 2026

బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంత మంది దీనిని నార్మల్‌గా తీసుకుంటే, మరికొంత మంది మాత్రం నానబెట్టి తింటుంటారు.

బాదం

అయితే కొందరు నానబెట్టినవి తినడానికి ఇంట్రస్ట్ చూపరు. కానీ నానబెట్టిన బాదం తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

నానబెట్టిన బాదం

కాగా, ఇప్పుడు మనం నాన బెట్టిన బాదం పప్పులు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన జీర్ణ సమస్యలు తొలికి, జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట.

జీర్ణ సమస్యలు

నానబెట్టిన బాదం తినడం వలన ఇది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుందంట. అందువలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇది చాలా బెస్ట్.

బ్లడ్ షుగర్ కంట్రోల్

బాదం పప్పులో మెగ్నీషియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందంట.

మెగ్నీషియం పుష్కలం

బాదం గింజల్లో ప్రోటీన్, ఫైబర్ , కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోగనిరోధక శక్తి

అలాగే గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. నానబెట్టిన బాదం తినడం వలన ఇది అధిక కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యం