హాట్ డాగ్‌లు తినడం వల్ల ఆయుర్దాయం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. కానీ ఇది నిజంగా నిజమేనా? అనే సందేహం చాలా మందిలో ఉంది
TV9 Telugu
మిచిగాన్ విశ్వవిద్యాలయం ఈ విషయంపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో హాట్ డాగ్‌లతో పాటు అనేక ఇతర ఆహార పదార్థాలు శరీరంపై వాటి ప్రభావాలను వివరించింది
TV9 Telugu
ఈ అధ్యయనంలో ఆయుర్దాయాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి దోహదపడే ఆహారాలు ఏవి? ఆరోగ్యానికి హాని కలిగించేవి ఏవి? మేలు చేసేవి ఏవి? అనే విషయాలు శాస్త్రవేత్తలు తేల్చారు
TV9 Telugu
హాట్ డాగ్‌లు తినడం వల్ల ఆయుర్దాయం తక్షణమే తగ్గిపోతుందని ఈ అధ్యయనం తేల్చలేదు. బదులుగా వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు తెలిపారు
TV9 Telugu
హాట్ డాగ్‌లలో ఉండే ప్రాసెస్ చేసిన మాంసం, అధిక ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీని అర్థం దీర్ఘకాలం పాటు హాట్ డాగ్‌లు తినడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫలితంగా ఆయుర్దాయం తగ్గుతుంది
TV9 Telugu
విదేశీయులు ఎక్కువగా తినే ఈ ఆహారాలలో సోడియం, నైట్రేట్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ తో తయారు చేసే హాట్ డాగ్ లో ఇవి అధికం. ఇది బీపీ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. గొప్పలకు, రుచికి పోయి వీటిని తింటే హై బీపీ ముప్పు తప్పదు
TV9 Telugu
హాట్ డాగ్‌లు మాత్రమే కాకుండా అనేక ఇతర ఆహారాలు కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని పరిశోధనలో తేలింది. అధికంగా ప్రాసెస్ చేసిన మాంసం, అధిక సోడియం కలిగిన ఆహారాలు ఆరోగ్యానికి హానికరం
TV9 Telugu
ఈ ఆహారాలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఫాస్ట్ ఫుడ్ వంటి అధిక సోడియం ఉన్న ఆహారాలు ఊబకాయాన్ని పెంచుతాయని కూడా తేలింది. ఈ వ్యాధులను సకాలంలో నియంత్రించకపోతే మరణానికి దారితీయవచ్చు