యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గ్రామ సివార్లో ఎలుగుబంటి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. రైతు ఎలిమినేటి రవీందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని సీసీ కెమెరాల్లో ఎలుగుబంటి దృశ్యాలు రికార్డయ్యాయి. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని పట్టుకొని రక్షణ కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.