Ranga Maarthaanda: రంగ మార్తాండ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేది అప్పుడే.. అలాగే ఓటీటీకి కూడా

దేశభక్తి సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు యాక్షన్ సినిమాలు కూడా తెరకెక్కించి మెప్పించారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. కాగా ఇటీవల ఆయన సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు

Ranga Maarthaanda: రంగ మార్తాండ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేది అప్పుడే.. అలాగే ఓటీటీకి కూడా
Rangamarthanda
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2023 | 8:09 AM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత వస్తోన్న సినిమా రంగమార్తాండ.టాలీవుడ్ లో కృష్ణవంశీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల్లో ఎదో స్పార్క్ ఉంటుంది. దేశభక్తి సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు యాక్షన్ సినిమాలు కూడా తెరకెక్కించి మెప్పించారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. కాగా ఇటీవల ఆయన సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమానే రంగమార్తాండ.. ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక జంటగా నటిస్తున్నారు. రంగమార్తాండ సినిమా నట సామ్రాట్ అనే సినిమాకు రీమేక్ గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ను ఇండస్ట్రీలో చాలా మందికి ప్రీమియర్స్ వేసి చూపించారు కృష్ణవంశీ.

ఈ సినిమాను చూసిన వారందరూ చాలా బాగుందని, కన్నీళ్లు తెప్పించిందని, గుండె బరువెక్కింది అని చెప్తున్నారు. మార్చి 22న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన 4 లేదా 5 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ బిజినెస్ భారీగా జరిగిందని తెలుస్తోంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?