Nidhi Agarwal: హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా.? తెలిస్తే ఆశ్చర్యపోతారు
అందాల భామ నిధిఅగార్వల్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మొన్నటివరకు టాలీవుడ్ సినిమాలో మెరిసిన ఈ భామ. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.. ఇటీవలే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నిధి అగర్వాల్.. అందం, అభినయం ఉన్న అదృష్టం కలిసి రాని ముద్దుగుమ్మ ఈ అమ్మడు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది నిధి అగర్వాల్. తెలుగులో అక్కినేని అందగాడు నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తొలి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ చిన్నది నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మిస్టర్ మజ్ను అనే సినిమాలో నటించింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక పూరి డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ క్రేజ్ మరింత పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ వచ్చాయి. ఇటీవలే రెండు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అలాగే ఇటీవలే ప్రభాస్ నటించిన సినిమాలోనూ మెరిసింది.
రాజా సాబ్ సినిమాలో నటించింది నిధి అగర్వాల్.. ఈ సినిమా జనవరి 9న విడుదలైంది.. కానీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే తన ఫోన్ వాల్ పేపర్ ఏంటో కూడా తెలిపింది. నిధి అగర్వాల్ వాల్ పేపర్ మరేదో కాదు హనుమాన్. తన ఫోన్ వాల్ పేపర్ గా హనుమంతుడి ఫోటో ఉంటుందని చూపించింది నిధి అగర్వాల్. అలాగే తనకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే హనుమాన్ చాలీసా చదువుతాను అని తెలిపింది నిధి అగర్వాల్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
