నా చెల్లి బాధ చూడలేక చనిపొమ్మని చెప్పా.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా, సహాయక నటుడిగా, యాంకర్ గా.. ఇలా టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రాజీవ్ కనకాల. తన అద్భుతమైన నటనతో వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా అదరగొట్టాడు. అప్పుడెప్పుడో 1991లో సినిమాల్లో అడుగ పెట్టిన అతను ఇప్పటికీ బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు రాజీవ్ కనకాల. చిన్న చిన్న పాత్రలతో పాటు విలన్ పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు రాజీవ్ కనకాల. నటుడిగా, విలన్ గా, సహాయక నటుడిగా, కమెడియన్ గా, యాంకర్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా రాజీవ్ కనకాల గతంలో ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను, సినీ ప్రస్థానం గురించి మాట్లారు. మూడు సంవత్సరాల్లో (2018-2020 మధ్య) తన తల్లి, చెల్లెలు శ్రీలక్ష్మి, తండ్రి దేవదాస్ కనకాలలను వరుసగా కోల్పోయిన విషాద సంఘటనలు తనను ఎంతగానో కలచివేశాయని ఆయన తెలిపారు.
ఆ సమయంలో తాను సినిమాలపై దృష్టి సారించలేకపోయానని, మానసికంగా ఎంతో బాధపడ్డానని తెలిపారు రాజీవ్. నారప్ప సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు, పాండమిక్ సమయంలో తన చెల్లెలు శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురయ్యారని రాజీవ్ కనకాల తెలిపారు. మధురైలో షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, శ్రీలక్ష్మి అనారోగ్యం విషమించింది, లాక్‌డౌన్ సమయంలోనే ఆమె ఏప్రిల్ ఆరవ తేదీన తుది శ్వాస విడిచారని కన్నీటి పర్యంతమయ్యారు రాజీవ్. శ్రీలక్ష్మికి నాల్గవ దశ క్యాన్సర్ ఉందని చివరి నిమిషంలోనే తెలిసిందని, చివరి వారం రోజులు ఆమెతోనే గడిపానని, ఆమె పక్కన సంతోషంగా అందరూ ఉండాలని భావించామని తెలిపారు.
ఒక వారం రోజుల్లోనే చనిపోయింది. ఆమె బాధను చూడలేక నేనే ఇక చాల్లే ఇంకా పెట్టుకోకు ప్రాణాన్ని వదిలేయ్ అయ్యాను.. అంటూ ఎమోషనల్ అయ్యారు రాజీవ్ కనకాల. శ్రీలక్ష్మి తనకన్నా ఒకటిన్నర సంవత్సరం చిన్నదని, ఆమెపై తమ తండ్రికి విపరీతమైన ప్రేమ ఉండేదని గుర్తుచేసుకున్నారు. వరుసగా తల్లి, చెల్లెలు శ్రీలక్ష్మి, తండ్రి దేవదాస్ ను కోల్పోవడం రాజీవ్ కనకాల జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
