Ranbir Kapoor: ఆ హీరోలు ఫెయిల్ అవ్వడంతో.. రణబీర్ మీదే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్..
ఎలాంటి అంచనాలు లేని హీరోలు.. వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. దీంతో ఎవరి మీద భారీగా ఖర్చు పెట్టొచ్చు అన్న విషయంలో నార్త్ మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
బాలీవుడ్‌లో మోస్ట్ డిపెండబుల్ హీరోల లిస్ట్ వెంట వెంటనే మారపోతోంది. ఒక సీజన్‌లో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న స్టార్స్ నెక్ట్స్ సీజన్‌లో ఫ్లాపుల్లో పడిపోతున్నారు. ఎలాంటి అంచనాలు లేని హీరోలు.. వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. దీంతో ఎవరి మీద భారీగా ఖర్చు పెట్టొచ్చు అన్న విషయంలో నార్త్ మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కోవిడ్‌కు ముందు వరుస బ్లాక్ బస్టర్స్‌తో సూపర్ ఫామ్‌లో కనిపించారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఎక్స్‌పరిమెంట్ మూవీస్, బయోపిక్స్, కమర్షియల్ ఎంటర్‌టైనర్స్.. ఇలా ఏ సినిమా చేసిన సూపర్ హిట్ అనిపించుకున్నారు.
కానీ రీసెంట్‌గా అక్షయ్ టైమ్ ఏమంత బాలేదు. వరుసగా అన్ని సినిమాలు బోల్తా పడుతుండటంతో అక్షయ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. అక్షయ్ ఫెయిల్ అవుతున్న టైమ్‌లోనే బాలీవుడ్‌లో మిస్టర్ డిపెండబుల్‌గా అవతరించారు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఎలాంటి బ్యాక్ బ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న కార్తీక్.. బాలీవుడ్ కష్టాల్లో ఉన్న టైమ్‌లోనూ బ్లాక్ బస్టర్స్‌తో సత్తా చాటారు. కానీ రీసెంట్‌గా కార్తీక్‌కి కూడా ఫెయిల్యూర్ ఎదురైంది. సౌత్‌లో సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసిన కార్తీక్ ఆర్యన్ అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించలేకపోయారు. దీంతో కార్తీక్ ఆర్యన్ జోరుకు బ్రేకులు పడ్డాయి.
తాజాగా నార్త్ సినిమాకు నయా సేవియర్‌గా మారారు స్టార్ కిడ్ రణబీర్ కపూర్. రీసెంట్‌గా బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రణబీర్… సౌత్‌లోనూ సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా తూ ఝూటీ మై మక్కర్ సినిమా కూడా మంచి విజయం సాధించటంతో రణబీర్ మీదే ఆశలు పెట్టుకుంది బాలీవుడ్. ప్రజెంట్ రణబీర్ నటిస్తున్న యానిమల్ సినిమా విషయంలోనూ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తుండటంతో.. నార్త్ ఇండస్ట్రీకి ప్రజెంట్ మిస్టర్ డిపెండబుల్ హీరో రణబీరే అంటున్నారు విశ్లేషకులు.