Nani: అది చాలా తప్పు.. కేజీఎఫ్ పై వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయిన నాని
ఇటీవల దర్శకుడు వెకంటేష్ మహా ఈ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు.
కేజీఎఫ్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యశ్. ఓవర్ నైట్ లో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత విజయం అందుకుంది. సినిమాలోని కథ, యశ్ యాక్టింగ్.. మ్యూజిక్ , ప్రశాంత్ నీల్ డైరెక్షన్.. ఇలా అన్ని కలగలిపిన కేజీఎఫ్ భారీ విజయం అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల దర్శకుడు వెకంటేష్ మహా ఈ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు.
దాంతో ఆయన పై కేజీఎఫ్ ఫ్యాన్స్ , యశ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా కూడా వెంకటేష్ మహా వెనక్కి తగ్గలేదు. నా భాష సరిగ్గా లేకపోవచ్చు కానీ.. నా అభిప్రాయం మాత్రం అదే అని చెప్పుకొచ్చాడు. దాంతో చాలా మంది వెంకటేష్ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ వివాదం పై నేచురల్ స్టార్ నాని స్పందించారు.
ఆరోజున ఆ డైరెక్టర్స్ అంతా కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూని నేను కూడా చూశాను. వెంకటేష్ మహా మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. అతని అభిప్రాయం చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో అప్పటి వరకు జరిగిన డిస్కషన్ వేరు కానీ అది ఉన్నట్టుండి వేరేలా మారింది.. సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్స్ అంతా థియేటర్ బయటకు వచ్చి మాట్లాడుకున్నట్టు అయ్యింది. అందుకే వెంకటేష్ నిఆ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఒకరు తన ఒపీనియన్ చెప్పేటప్పుడు పక్కనున్న వాళ్లకు నవ్వు వస్తుంది. అక్కడ కూడా అదే జరిగింది. అందువల్ల మహా ఒపీనియన్ ఇంకా తప్పు అన్నట్లు మారింది.. నిజానికి ఓ మాస్ సినిమా చూస్తున్నప్పుడు అందరికంటే ఎక్కువగా గోల చేసేది, ఎంజాయ్ చేసేది దర్శకులే. అయినా 10 సెకన్ల వీడియో చూసి జడ్జి చేయడం అనేది చాలా తప్పు అంటూ చెప్పుకొచ్చాడు నాని.