AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ధనుష్ చేసింది తప్పైతే.. మరీ నీ భర్త చేసింది ఏంటీ..? నయతార దంపతులపై నిర్మాత ఫైర్..

నానుమ్ రౌడీ థాన్ సినిమా నుంచి మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించడానికి అనుమతి ఇవ్వడం లేదని.. ప్రతీకారంగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంటూ హీరో ధనుష్ పై నయనతార సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం పై ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కుమరన్ స్పందిస్తూ నయన్, ఆమె భర్త విఘ్నేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Nayanthara: ధనుష్ చేసింది తప్పైతే.. మరీ నీ భర్త చేసింది ఏంటీ..? నయతార దంపతులపై నిర్మాత ఫైర్..
Ss Kumaran, Nayanthara
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2024 | 6:56 AM

Share

కోలీవుడ్ హీరో ధనుష్ పై హీరోయిన్ నయనతార తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తమ పెళ్లి డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజీ వాడినందుకు మాపై పగ తీర్చుకోవడం సరికాదని.. ఓ చిన్న క్లిప్ వాడినందుకు రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేయడం సరికాదని.. సూక్తులు చెప్పే నువ్వు పాటించవని.. నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు నీ అభిమానులకు తెలుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ధనుష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ బహిరంగ లేఖ రాసింది. దీంతో నయన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఇష్యూపై అటు నయనతారకు.. ఇటు ధనుష్ కు సినీతారలు, దర్శకనిర్మాతల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో కోలీవుడ్ ప్రొడ్యూసర్, దర్శకుడు ఎస్ఎస్ కుమారన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ధనుష్ పై నయన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై విరుచుకుపడ్డారు.

“తన అనుమతి లేకుండా మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుష్ మీకు లీగల్ నోటీసు ఇచ్చారని మీరు తప్పుబడుతున్నారు. మరీ మీ భర్త చేసింది ఏంటీ.. నేను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ అని తెలిసి కూడా మీ భర్త ఎల్‌ఐసీ టైటిల్‌ని తన సినిమా కోసం ఉపయోగించాడు. ఆ టైటిల్ కోసం అతడు నన్ను నేరుగా కాకుండా వేరొకరిని పంపించాడు. అది నా సినిమా స్టోరీకి సంబంధించిన టైటిల్ అని చెప్పి నేను సున్నితంగా తిరస్కరించాను. అయినా నా అనుమతి లేకుండానే నేను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ నీ భర్త ఎలా ఉపయోగించారు. మరీ దీనిని మీరు ఎలా సమర్దిస్తారు. ఆ ఫుటేజీని ఉపయోగించడానికి మీ కంటే శక్తివంతమైన వ్యక్తి నుండి అనుమతి కోసం మీరు రెండేళ్లపాటు ఓపికగా వెయిట్ చేశారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్ను మీరు తొక్కేశారు. అది నిజంగా నన్ను కలచివేసింది. మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. మీవల్ల నేను చాలా మానసిక క్షోభ అనుభవించాను. అది నా సినిమా పై కూడా ప్రభావం చూపించింది.

ప్రతి సినిమా నిర్మాత తన సినిమాల కోసం సయమాన్ని, డబ్బును వెచ్చిస్తారు.. కానీ మీరు మీ వ్యాపార ప్రయోజనాల కోసం ఏదైనా ఉపయోగించాలనుకుంటే మీరు చట్టబద్ధంగా సరైన విధంగా అనుమతి తీసుకోవాల్సిందే. మీరేమి ఉచితంగా నటించడం లేదు.. కానీ మీరు మాత్రం మా ఫుటేజ్, టైటిల్ ను ఉచితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీరు, మీ భర్త ఈ భయంకరమైన ట్రెండ్ ను సినిమా పరిశ్రమలో సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు” అంటూ లేఖ విడుదల చేశారు డైరెక్టర్ ఎస్ఎస్ కుమరన్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?