Selvaraghavan: సెల్వరాఘవన్‌ను పొట్టుపొట్టు తిట్టిన భార్య.. వైరల్ అవుతున్న వీడియో
7G బృందావన్ కాలనీలాంటి లవ్ స్టోరీ తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశారు సెల్వరాఘవన్. ఈ సీమ తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. ఆతర్వాత నేరుగా తెలుగులో వెంకటేష్ తో సినిమా చేశారు. ఆడవాళ్ళ మాటలకూ అర్ధాలే వేరులే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు సెల్వరాఘవన్.
కోలీవుడ్ లో ఉన్న ప్రముఖ దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. 7G బృందావన్ కాలనీలాంటి లవ్ స్టోరీ తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశారు సెల్వరాఘవన్. ఈ సీమ తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. ఆతర్వాత నేరుగా తెలుగులో వెంకటేష్ తో సినిమా చేశారు. ఆడవాళ్ళ మాటలకూ అర్ధాలే వేరులే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు సెల్వరాఘవన్. కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా తీశాడు. సెల్వరాఘవన్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎంతో వైవిధ్యమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు సెల్వరాఘవన్. 7G బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ ను సెల్వరాఘవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నాడు.
ఆగస్టు 9, 2009 న వీరిద్దరూ చెన్నైలోని ఓ కుటుంబ న్యాయస్థానంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తరువాత జూన్ 19, 2011న తమిళనాడు మాజీ అడ్వొకేట్ జనరల్ పి. ఎస్. రామన్ కూతురైన గీతాంజలిని వివాహం చేసుకున్నాడు సెల్వ రాఘవన్. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో సెల్వరాఘవన్ భార్య ఆయనను తిడుతూ కనిపించారు. సోషల్ మీడియాలో ఎల్వరాఘవన్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన కుటుంబానికి సంబందించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన భార్య తనను తిడుతున్న వీడియోను షేర్ చేశాడు. వీడియోలో సెల్వరాఘవన్ నేనేం చేశాను.. నన్ను ఎందుకు తిట్టావు.. అంటూ ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియోకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎంతటి మగాడైనా భార్య చేతిలో తిట్లు తప్పవని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
సెల్వరాఘవన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సెల్వరాఘవన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.