Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరో డాటర్.. అస్సలు ఊహించలేరు..
తాజాగా సోషల్ మీడియాలో పవన్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో పవన్ చేతుల్లో ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? పవన్ కూతురు ఆద్య అనుకుంటే పొరపాటే. ఆ చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ హీరో కోసం ప్రాణాలిచ్చే అభిమానులే ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్. ఇక పవన్ కు సంబంధించిన ఓ చిన్న పోస్ట్ కూడా క్షణాల్లో వైరలవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పవన్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో పవన్ చేతుల్లో ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? పవన్ కూతురు ఆద్య అనుకుంటే పొరపాటే. ఆ చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా మారాడు. మాస్ యాక్షన్ అయినా.. రొమాంటిక్ లవ్ స్టోరీలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఆ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉందని. అతడు మరెవరో కాదు.. మాస్ మాహారాజా రవితేజ గారాలపట్టి మోక్షద.
పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న అమ్మాయి రవితేజ కూతురు మోక్షద అని తెలుస్తోంది. రవితేజకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. కొడుకు మహదేవన్, కూతురు మోక్షద. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే రవితేజ.. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అంతగా బయటపెట్టరు. అలాగే రవితేజ కుటుంబం కూడా బయట ఎక్కడా కనిపించదు. కానీ అప్పుడప్పుడు తన ఇన్ స్టాలో కూతురు, కొడుకుతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తుంటారు రవితేజ. తాజాగా పవన్ చేతిలో మోక్షద ఉన్న ఫోటో నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. రవితేజ కుటుంబానికి, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. చిరుకు వీరాభిమాని రవితేజ. అన్నయ్య సినిమాలో చిరు తమ్ముడిగా కనిపించిన రవితేజ.. నిజజీవితంలోనూ చిరును అన్నయ్య అని పిలుస్తుంటాడు. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
@massmaharaaj #RaviTeja ‘s Daughter MOKSHADA with #PawanKalyan 🙂 Rare & Unseen pic in 2007 ! @manikick @NelluriRami pic.twitter.com/pz0m1dXbP4
— #RaviTeja #RamaRaoOnDuty (@ravitejafanRtf) December 31, 2013
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.