T20 World Cup: విశ్వవిజేతగా నిలిచిన భారత్.. టీమిండియాకు అభినందనలు తెలిపిన సెలబ్రిటీస్..

ఒక దశలో సౌతాఫ్రికా బ్యాటర్స్ దూకుడుగా ఆడడంతో భారతీయులలో ఆందోళన నెలకొంది. కానీ చివరి ఓవర్ లో భారత్ అద్భుతమైన బౌలింగ్ తో విజేతలుగా నిలిచి ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు దేశ ప్రజలు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఆటతీరును కొనియాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్ టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

T20 World Cup: విశ్వవిజేతగా నిలిచిన భారత్.. టీమిండియాకు అభినందనలు తెలిపిన సెలబ్రిటీస్..
T20 World Cup
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 30, 2024 | 7:37 AM

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‏లోనే టీమ్ ఇండియా విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టీ20 వరల్డ్ కప్‏లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో దేశమంతా సంబరాలు చేసుకుంటుంది. మ్యాచ్ అనంతరం స్టేడియంలోని అభిమానులతోపాటు ఆటగాళ్లు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. కోహ్లి (76), అక్షర్ (47)తో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులు చేయడంతో భారత్ ఖాతాలో టీ20 వరల్డ్ కప్ విజయం నిలిచింది. ఒక దశలో సౌతాఫ్రికా బ్యాటర్స్ దూకుడుగా ఆడడంతో భారతీయులలో ఆందోళన నెలకొంది. కానీ చివరి ఓవర్ లో భారత్ అద్భుతమైన బౌలింగ్ తో విజేతలుగా నిలిచి ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు దేశ ప్రజలు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఆటతీరును కొనియాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్ టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి.. 17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ ను గెలవడం అద్భుతం. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగన ఉంది. విరాట్ కోహ్లీ భలే ఆడావు. బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్ అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు తిరుగులేని ఆటతీరు కనబర్చిన యావత్ జట్టుకు శిరసు వంచి వందనం చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. అలాగే నమ్మశక్యం కానీ రీతిలో క్యాచ్ పట్టిన సూర్య కుమార్ యాదవ్ అదరహో అనిపించాడు అని అన్నారు.

మహేష్ బాబు.. ఈ కప్ మనది.. బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లు. టీమిండియాకు శిరసు వంచి వందనం చేస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయం పట్ల అమితగర్వంతో పొంగిపోతున్నానని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

రామ్ చరణ్.. టీమిండియాకు అనూహ్య విజయం. ఇండియా బాగా ఆడారు. బుమ్రా అద్భుతమైన ప్రదర్శన. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యకు అభినందనులు. మా కెప్టెన్ కు వందనాలు. ఈ విజయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు చరణ్.

జూనియర్ ఎన్టీఆర్.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

రాజమౌళి.. 

అల్లు అర్జున్..  

సల్మాన్ ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.