VIjay Deverakonda- Rashmika Mandanna: విజయ్ కంటే రష్మిక అన్ని సంవత్సరాలు చిన్నదా.. ? ఇద్దరి మధ్య వయసు తేడా ఎంతంటే..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వీరిద్దరి నిశ్చితార్థం వేడుక హైదరాబాద్ లోని విజయ్ స్వగృహంలో రెండ కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక త్వరలోనే విజయ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో విజయ్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. శుక్రవారం వీరిద్దరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై విజయ్, రష్మిక ఇద్దరూ స్పందించలేదు. త్వరలోనే వీరి నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన విజయ్.. రష్మిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించుకున్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వీరు షేర్ చేసే పోస్టులు ఆ వార్తలకు మరింత బలానిచ్చాయి. ఇక ఇప్పుడు ఇద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు వయసు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించారు. ప్రస్తుతం అతడి వయసు 36 సంవత్సరాలు. రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య 7 సంవత్సరాల వయసు తేడా ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..




