AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhas: హీరో సుహాస్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. సముద్రంలో పడవ బోల్తా.. వీడియో వైరల్

టాలీవుడ్ హీరో సుహాస్ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. అతను ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'మండాడి' సినిమా షూటింగ్ లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సముద్ర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా సినిమా యూనిట్ ప్రయాణిస్తోన్న పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.

Suhas: హీరో సుహాస్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. సముద్రంలో పడవ బోల్తా.. వీడియో వైరల్
Suhas Movie Shooting
Basha Shek
|

Updated on: Oct 05, 2025 | 11:38 AM

Share

హీరో సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం మండాడి. జాతీయ అవార్డు గ్రహీత వెట్రి మారన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో తమిళ న‌టుడు సూరి విలన్ గా నటించనున్నాడు. అదే తమిళ్ వెర్షన్ లో సుహాస్ విలన్ గా నటిస్తుండగా, సూరి హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై తీర ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. ఈ చిత్ర షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు. రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే, యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయాయి.

మండాది సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నాడు. RS ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సుహాస్, సూరిలతో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా ఇటీవలే రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు హీరో సుహాస్. అతని భార్య  లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.   సుహాస్‌-లలితలది ప్రేమ వివాహం. ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు కానీ పెద్దలు నో చెప్పేసరికి 2017లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.  గతేడాది జనవరిలో సుహాస్ భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లకు కొడుకు పుట్టాడు. దీంతో సుహాస్ కుటుంబంలో సంతోషం వెల్లివెరిసింది.

భార్య, కుమారుడితో హీరో సుహాస్..

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

ఓజీ సినిమా సెట్ లో సుహాస్..

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..