Tollywood: 15కు పైగా సినిమాలు.. గ్లామర్ ప్రపంచాన్ని IASగా మారిన హీరోయిన్.. ఎవరో తెలుసా.. ?

ఒకప్పుడు సినీరంగుల ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. దాదాపు 15కు పైగా సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన IAS అధికారులలో ఒకరు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Tollywood: 15కు పైగా సినిమాలు.. గ్లామర్ ప్రపంచాన్ని IASగా మారిన హీరోయిన్.. ఎవరో తెలుసా.. ?
Keerthana

Updated on: Aug 17, 2025 | 11:36 AM

సాధారణంగా సినీరంగంలోకి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెట్టినవారు చాలా మంది ఉంటారు. అప్పటివరకు వివిధ రంగాల్లో సెటిల్ అయిన పలువురు.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ సినిమాల్లో ఫేమస్ అయిన తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమైన తారల గురించి చెప్పక్కర్లేదు. అందులో HS కీర్తన ఒకరు. ఒకప్పుు తమిళ చిత్రపరిశ్రమలో ఆమె అగ్రనటి. కానీ ఇప్పుడు ఆమె ప్రసిద్ధ IAS అధికారి. UPSC పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పరీక్ష అన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో విజయం సాధించేందుకు చాలా మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడుతుంటారు. కానీ సినీరంగుల ప్రపంచంలో నటిగా వెలుగు వెలిగిన కీర్తన మాత్రం యూపీఎస్సీ ఆరవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఒకప్పుడు అగ్ర నటిగా ఉన్న HS కీర్తన ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం చిత్ర పరిశ్రమకు వీడ్కోలు పలికింది.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

IAS హెచ్ఎస్ కీర్తన.. కన్నడ టీవీ పరిశ్రమలో బాలనటిగా అరంగేట్రం చేసింది. చిన్నప్పటి నుంచే సినిమాలు, సీరియల్స్ లో వర్క్ చేసింది. ఆ తర్వాత తన కలలను నిజం చేసుకునేందుకు ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరేందుకు ఎంతో కష్టపడింది. HS కీర్తన.. 4 సంవత్సరాల వయస్సులో నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కర్పూరద గొంబే, గంగా-యమునా, ముద్దిన అలియా, ఉపేంద్ర, ఎ, కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమీషనర్ వంటి చిత్రాల్లో నటించింది. UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2019లో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 167ను సాధించింది. ఆమె UPSC ప్రిలిమ్స్ పరీక్షలో 5 సార్లు విఫలమైంది. కానీ ఆమె ఎప్పుడూ పట్టు వదలకుండా నిరంతరం సిద్ధమవుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

2019లో UPSC పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. 2011 ప్రారంభంలో కర్ణాటక సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా IAS అయ్యింది. IAS HS కీర్తన ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. 2020లో COVID-19 సమయంలో బెంగళూరులో BBMP తరపున ప్రత్యేక నోడల్ అధికారిగా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

Keerthana

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?