AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కార్పొరేట్ లాను విడిచి సినిమాల్లోకి.. బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. కట్ చేస్తే.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది..

సినీరంగంలో తనదైన ముద్ర వేసింది ఈ అచ్చతెలుగమ్మాయి. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే టాలీవుడ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Tollywood: కార్పొరేట్ లాను విడిచి సినిమాల్లోకి.. బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. కట్ చేస్తే.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది..
Shobitha
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2025 | 10:01 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ ఆమె. మోడలింగ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆమె నటిగా ప్రశంసలు అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే టాలీవుడ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్. తన అద్భుతమైన నటనతో ఉత్తరాది ప్రేక్షకులను కట్టిపడేసిన అచ్చ తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన శోభిత ధూళిపాళ్ల.. మే 31, 1992న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి మర్చంట్ నేవీ ఇంజనీర్, తల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. శోభిత విశాఖపట్నంలో పెరిగారు.

16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లి ముంబై విశ్వవిద్యాలయంలోని హెచ్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో కార్పొరేట్ లా చదివారు. శోభిత కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్ కూడా. శోభిత ధూళిపాళ వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్ గా కిరీటాన్ని గెలుచుకుంది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. శోభిత మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీ ఫర్ ఎ కాజ్, మిస్ టాలెంట్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్స్ గెలుచుకుంది. శోభిత కింగ్‌ఫిషర్ క్యాలెండర్ 2014 ఎడిషన్‌లో కనిపించింది. విక్కీ కౌశల్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 (2016) సినిమాతో శోభిత తన నటనా రంగ ప్రవేశం చేసింది.

కానీ ఆమె నటించిన మేడ్ ఇన్ హెవెన్ (2019-2023) సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. గూడాఛారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే పొన్నియన్ సెల్వన్, కురుప్, మూథాన్ వంటి చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం జరిగింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..