Tollywood: 18 ఏళ్లకే పెళ్లి, పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. హీరోయిన్లను మించిపోయిన బ్యూటీ..
సినీరంగుల ప్రపంచంలో తారలుగా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. వెండితెరపై తమ నటనతో అలరించి..రియల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ మానసిక సంఘర్షణకు గురవుతుంటారు. ఈ హీరోయిన్ లైఫ్ సైతం అలాంటిందే. రెండుసార్లు ప్రేమను నమ్మితే.. మోసమే ఎదురైంది. ఆమె ఎవరంటే..
సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. 18 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లకే తల్లైంది. ఆ తర్వాత విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం సైతం ఎక్కువ కాలం నిలవలేదు. రెండుసార్లు డివోర్స్ తీసుకుని ఒంటరిగా గడుపుతున్న ఈ భామ.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటిగా మారింది. ఆమె ఎవరో తెలుసా.. ? తనే బుల్లితెర నటి శ్వేతా తివారీ. ఆమె గురించి తెలుగు ప్రేక్షకుల కంటే ఎక్కువగా హిందీ అడియన్స్ కే పరిచయం.
హిందీలో ఎక్కువ పాపులర్ అయిన సీరియల్ కసౌటి జిందగీ కె. ఇందులో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా తివారీ. ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఏడేళ్లపాటు ఈ సీరియల్ ద్వారా అలరించి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. తన ఆట తీరుతో ఈ రియాల్టీ షో టైటిల్ గెలుచుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు పేరు మారుమోగింది. అదే సమయంలో అటు ఫాలోయింగ్ సైతం పెరిగింది. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.
వెండితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా.. 1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి పాలక్ తివారి అనే పాప జన్మించింది. కానీ వీరిద్దరు 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. వీరికి రేయాన్ష్ కోహ్లీ జన్మించాడు. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2019లో తన భర్త గృహ హింసకు పాల్పడుతున్నాడని కోర్టును ఆశ్రయించగా.. కోర్టు విడాకులు మంజులు చేసింది. ప్రస్తుతం వరుస సీరియల్స్ ద్వారా భారీగా సంపాదిస్తుంది శ్వేతా. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.81 కోట్లు ఉంటుందని సమాచారం.
View this post on Instagram
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.