AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: ఆ హీరోయిన్ సలహా.. బేబీ జాన్ సినిమాకు కీర్తిని సెలక్ట్ చేశారు.. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఇన్నాళ్లు దక్షిణాదిలో సత్తా చాటిన కీర్తి సురేష్.. ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకు కీర్తి పేరును మరో హీరోయిన్ సజెస్ట్ చేసిందట.

Keerthy Suresh: ఆ హీరోయిన్ సలహా.. బేబీ జాన్ సినిమాకు కీర్తిని సెలక్ట్ చేశారు.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Baby John
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2024 | 5:09 PM

Share

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా బేబీ జాన్. డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 25న కిస్మస్ కానుకగా అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలకు 20 రోజుల ముందే ఒక్క హిందీలోనే పుష్ప 2 ప్రాజెక్ట్ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే సమయంలో విడుదలైన బేబీ జాన్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు రూ.43 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

దాదాపు రూ.160 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 43 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు కీర్తి పేరును రికమండ్ చేశారట ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఈ విషయాన్ని కీర్తి స్వయంగా వెల్లడించింది. ఆమె మరెవరో కాదు.. టాప్ హీరోయిన్ సమంత. ఈ సినిమాకు తన పేరును చెప్పింది సమంత అని వరుణ్ ధావన్ తనతో అన్నారని ఇటీవల కీర్తి చెప్పుకొచ్చింది. సమంత తమిళంలో నటించిన చిత్రాల్లో థేరి అంటే తనకు చాలా ఇష్టమని.. హిందీలో ఆ పాత్ర పోషించేందుకు చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది.

థేరి చిత్రాన్ని తమిళంలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించారు. ఇందులో సమంత, అమీ జాక్సన్, విజయ్ దళపతి ప్రధాన పాత్రలు పోషించారు. రాధిక శరత్ కుమార్ కీలకపాత్ర పోషించగా.. 2016లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ రూ.125 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయగా.. కేవలం రూ.43 కోట్లు రాబట్టింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.