AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అతడికి 30.. ఆమెకు 16.. కట్ చేస్తే.. 15 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..

ఇండస్ట్రీలో తోపు హీరో.. కానీ 30 ఏళ్ల వయసులో తనకంటూ 16 ఏళ్ల చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమ, పెళ్లి అప్పట్లో సినీరంగంలో హాట్ టాపిక్ అయ్యింది. అప్పటికే సినిమాల్లో అగ్ర కథానాయకుడు అయినప్పటికీ తన పెళ్లి విషయంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా.

Tollywood : అతడికి 30.. ఆమెకు 16.. కట్ చేస్తే.. 15 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..
Dimple Kapadia
Rajitha Chanti
|

Updated on: May 14, 2026 | 2:03 PM

Share

వెండితెరపై తమ సహజ నటనతో, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. కానీ సినీరంగుల ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న తారల వ్యక్తిగత జీవితాలు మాత్రం ఆశ్చర్యకరంగా సాగుతుంటాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలా మంది అంటుంటారు. అదే మాటను నిజం చేశాడు ఓ స్టార్ హీరో. తనకంటే వయసులో చాలా చిన్న అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇంతకీ వీరి ప్రేమ కథేంటో తెలుసుకుందామా. డింపుల్ కపాడియా.. 1973లో విడుదలైన బాబీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా రిషి కపూర్ సరసన నటించింది. మొదటి సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకు పెద్ద అభిమాని. ఒకసారి ఆమెకు విమాన ప్రయాణంలో రాజేష్ ఖన్నాను కలిసి అవకాశం వచ్చింది. అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తనకంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన రాజేష్ ఖన్నాను డింపుల్ కపాడియా వివాహం చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఆమె రాజేష్ ఖన్నాతో తన వివాహాన్ని తన జీవితంలో అతిపెద్ద మైలురాయిగా భావించింది. పెళ్లి తర్వాత, రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియాను సినిమాల్లో నటించవద్దని పట్టుబట్టారు. అందుకే, ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాలకు ట్వింకిల్ ఖన్నా, రింగీ ఖన్నా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరుస వైఫల్యాల తర్వాత, రాజేష్ ఖన్నా మద్యానికి బానిసయ్యారని, ఇంట్లో సమస్యల్లో చిక్కుకున్నారని అంటారు. రోజూ జరిగే గొడవలతో విసిగిపోయిన డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నా ఇంటిని విడిచిపెట్టింది. భర్త నుండి విడిపోయిన తర్వాత, డింపుల్ తన పిల్లలను ఒంటరిగా పెంచింది. అప్పుడే రాజేష్ ఖన్నా తన ప్రియురాలు అనితా అద్వానీతో కలిసి జీవించడం స్టార్ట్ చేశాడు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

అయితే జీవితాంతం రాజేష్ ఖన్నా తన ప్రియురాలితోనే కలిసి ఉన్నాడు. కానీ డింపుల్ మాత్రం అతడికి విడాకులు ఇవ్వకుండానే దూరంగా ఉండిపోయింది. ఒక ఇంటర్వ్యూలో రాజేష్ ఖన్నా మాట్లాడుతూ, డింపుల్ కపాడియా తనకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదని, దానికి కారణం కేవలం తనకే తెలుసని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Dimple Kapadia, Rajesh Khan

Dimple Kapadia, Rajesh Khan

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Follow Us