AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ అంటే చచ్చేంత ప్రాణం.. ఆ రోజు వచ్చిందంటే అంతా ముగిసిపోతుంది.. విరాట్ కోహ్లీ

రాయ్‌పూర్ స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వర్షం కారణంగా పిచ్ కఠినంగా మారినా, తన అనుభవంతో బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ స్టేడియంను హోరెత్తించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

క్రికెట్ అంటే చచ్చేంత ప్రాణం.. ఆ రోజు వచ్చిందంటే అంతా ముగిసిపోతుంది.. విరాట్ కోహ్లీ
Virat Kohli
Ravi Kiran
|

Updated on: May 14, 2026 | 1:20 PM

Share

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది ఒక్క విరాట్ కోహ్లీకే సాధ్యం. వయసు పెరుగుతున్నా, ఆటపై అతనికున్న కసి, పట్టుదల ఏమాత్రం తగ్గలేదని ఐపీఎల్ 2026లో మరోసారి నిరూపించాడు. ఇటీవల రాయిపూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన తీరు చూస్తుంటే, అతను ఎందుకు ప్రపంచ అత్యుత్తమ బ్యాటరో అందరికీ అర్థమైంది. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, మైదానంలో అతను చూపే ఎనర్జీ కూడా యువ ఆటగాళ్లకు ఒక పాఠం లాంటిది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో 9వ శతకాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయిపూర్ పిచ్ వర్షం కారణంగా బ్యాటింగ్‌కు అంతగా సహకరించకపోయినా, బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతున్నా కోహ్లీ మాత్రం పక్కా ప్రణాళికతో ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూనే, గ్యాపులను వెతుక్కుంటూ సింగిల్స్‌తో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. తన వన్ మ్యాన్ షోతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గెలిపించి అభిమానులకు తీపి జ్ఞాపకాన్ని అందించాడు.

మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై కోహ్లీ ఎంతో భావోద్వేగంగా స్పందించాడు. “ఇన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా, బ్యాట్‌తో బంతిని కొట్టినప్పుడు కలిగే ఆ ఆనందం ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో ఉండే ప్రతి క్షణాన్ని నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ ప్రయాణం ముగుస్తుంది. అందుకే ఉన్నంత కాలం నా వంద శాతం శ్రమను జట్టు కోసం ఇస్తాను” అని కోహ్లీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. కష్టకాలంలో జట్టుకు ఏం కావాలనేది తన మైండ్‌లో నిరంతరం రన్ అవుతూనే ఉంటుందని అతను తెలిపాడు.

ఒత్తిడిని ఎదుర్కోవడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. “నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం వల్ల నాలో ఉన్న అసలైన ఆటగాడు బయటకు వస్తాడు” అని కోహ్లీ అన్నాడు. తన 9వ ఐపీఎల్ సెంచరీతో అతను కేవలం రికార్డులనే కాదు, అభిమానుల హృదయాలను కూడా మరోసారి గెలుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ‘కింగ్’ ఎప్పటికీ కింగేనని ఈ ప్రదర్శనతో మరోసారి స్పష్టమైంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..