AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రూ.310 కోట్లు విరాళం ఇచ్చిన ఏకైక హీరో.. ఎవరో తెలుసా.. ?

సాధారణంగా సినీరంగంలోని స్టార్ హీరోస్ అటు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇటు సామాజిక సేవలలోనూ ముందుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సూర్య, విజయ్ దళపతి, ధనుష్, రాఘవ లారెన్స్ వంటి స్టార్స్ ఇప్పటికీ ఎంతో మంది పేదలకు సాయం అందిస్తుంటారు. కానీ మీకు తెలుసా.. ? ఒక హీరో రూ.310 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Tollywood: రూ.310 కోట్లు విరాళం ఇచ్చిన ఏకైక హీరో.. ఎవరో తెలుసా.. ?
Kamal Haasan, Shivaji Ganes
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2025 | 9:20 AM

Share

సినీరంగంలో ఎంతో మంది తారలు సామాజిక సేవ కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోస్ ఇప్పటికే ఎంతోమందికి ఆర్థికంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూర్య, మహేష్ బాబు, విజయ్ దళపతి వంటి స్టార్స్ పేద ప్రజలకు అండగా నిలిచారు. కానీ మీకు తెలుసా.. ? దిగ్గజ నటుడు కోట్ల రూపాయాలు విరాళంగా ప్రకటించారు. ఆయన ఎవరో తెలుసా..? 1953 నుండి 1993 మధ్య 40 సంవత్సరాలలో ఒక తమిళ నటుడు దాదాపు 310 కోట్ల రూపాయలు ఇతరులకు విరాళంగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఆయన మరెవరో కాదు..నటుడు తిలకం శివాజీ గణేషన్. ఆయన మరణించి 23 సంవత్సరాలు గడిచినప్పటికీ, తమిళ సినిమాల్లో తనదైన ముద్రవేసిన నటుడు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

కట్టబొమ్మన్, సుభాష్ చంద్రబోస్ పాత్రలకు ప్రాణం పోసిన నటుడు.. పరాశక్తి నుండి పడయప్ప వరకు తన 49 సంవత్సరాల సినీ ప్రయాణంలో శివాజీ గణేషన్ 288 చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం, కామరాజ్ నుండి ప్రధాని నెహ్రూ వరకు అందరి పాలనలో ఆయన విరాళాలు ఇచ్చాడు. విపత్తులకు వెంటనే వెళ్లి ఆర్థిక సహాయం అందించాడు. 1968లో ఆయన తిరుచ్చిలోని జమాల్ మొహమ్మద్ కళాశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. అదే సంవత్సరం వెల్లూరులోని ఒక ఆసుపత్రికి రూ. 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రపంచ తమిళ సదస్సులో అన్నా అభ్యర్థనను అంగీకరించి తిరువళ్లువర్ విగ్రహానికి రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

కామరాజ్ కు పార్టీ నిధులుగా రూ.3 లక్షల 50 వేలు ఇచ్చారు. 1971లో శివాజీ అనేక సహాయాలు అందించారని, వాటిలో కోడంబాక్కంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.50 వేలు, వీరపాండియ కట్టబొమ్మన్ విగ్రహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించారని సమాచారం. తన జీవితకాలంలో మొత్తం రూ. 310 కోట్లు (34 లక్షల 6,009 రూపాయలు) విరాళంగా ఇచ్చారని సమాచారం.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..