హద్దులు దాటిన తమన్నా.. ముద్దుల గురించి ఏం చెప్పారు
నో కిస్ రూల్‌ని ఎందుకు పక్కనపెట్టేయాల్సి వచ్చిందో తమన్నా చెప్పిన తర్వాత మిగిలిన హీరోయిన్ల మీద ఫోకస్ మళ్లింది. నార్త్ లో ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్లు అందరూ నో కిస్ రూల్ బ్రక్ చేసిన వాళ్లే. పెళ్లి కాని వాళ్లే కాదు.. ఆఫ్టర్ మేరేజ్ కూడా కిస్‌ని భూతద్దంలో చూడటం లేదు బ్యూటీస్. తమన్నా అనగానే గ్లామర్ నటి అనే ముద్ర పడిపోయింది. అయినా నేను కెరీర్ బిగినింగ్‌లో చాన్నాళ్లు కిస్సింగ్ సీన్స్ ని ఓకే చేసేదాన్ని కాదు.
Updated on: Aug 18, 2025 | 9:52 PM

తమన్నా అనగానే గ్లామర్ నటి అనే ముద్ర పడిపోయింది. అయినా నేను కెరీర్ బిగినింగ్‌లో చాన్నాళ్లు కిస్సింగ్ సీన్స్ ని ఓకే చేసేదాన్ని కాదు. కానీ, నాకున్న ఇమేజ్‌కీ, నేను పెడుతున్న కండిషన్స్ కీ ఎక్కడో పొంతన కుదరలేదు.

సో చాలా అవకాశాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే నో కిస్ రూల్‌ని బ్రేక్ చేశాను అని చెప్పారు తమన్నా. తమన్నా మాత్రమే కాదు.. నార్త్ లో ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్లందరూ నో కిస్ రూల్‌కి బ్రేక్ చెప్పేసిన వాళ్లే. ఆఫ్టర్ మేరేజ్ కూడా కిస్ సీన్స్ ని ఓకే చేస్తున్నవాళ్లే. అందుకు వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ కియారా అద్వానీ. వార్2లో హృతిక్ రోషన్‌తో నెంబర్ ఆఫ్ కిసెస్ ఉన్నాయి కియారాకి.

ఆలియా విషయంలోనూ ఈ విషయం అప్పట్లో బాగానే ట్రెండ్ అయింది. పెళ్లయ్యాక లిప్ లాక్స్ కి ఆలియా నో చెబుతారనే టాక్ అప్పట్లో స్ప్రెడ్ అయింది. అయితే అందరికీ షాక్ ఇచ్చింది ఆలియా డెసిషన్. ఆఫ్టర్ మేరేజ్ స్క్రీన్ మీద కోస్టార్‌తో ముద్దులు పంచుకున్నారు ఆలియా. సీన్ డిమాండ్ చేసినప్పుడు సిల్లీ విషయాలను ఆలోచించకూడదన్నది ఆమె మాట.

దీపిక పదుకోన్ కూడా ఈ విషయంలో ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. మన దగ్గర సమంత పెళ్లయ్యాక ముద్దు విషయంలో హద్దులు మీరారన్నది అప్పట్లో వైరల్ న్యూస్. రంగస్థలంలో చెర్రీకి, సామ్‌కీ లిప్ లాక్ ఉందనే టాపిక్ అప్పట్లో హాట్ న్యూస్.

అలాంటిదేమీ లేదనీ, కెమెరా జిమ్మిక్కులనీ సామ్ సర్దిచెప్పారు. సౌత్‌లో ఇప్పటికీ దాదాపు అదే మైండ్‌సెట్ కనిపిస్తున్నా.. నార్త్ మాత్రం ఓ అడుగు ముందుకేసిందన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం.




