Tollywood: తస్సాదియ్యా.. 23 ఏళ్లకే 250 కోట్ల సంపాదన.. స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్..
స్టార్ హీరోయిన్లకు మించి క్రేజ్ సొంతం చేసుకుంది ఓ అమ్మాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కెరీర్ స్టార్ చేసిన ఆ బ్యూటీ... ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు నెట్టింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

సినీరంగంలోకి అడుగుపెట్టి అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. తన ప్రతిభతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ వయ్యారి.. 23 ఏళ్ల వయసుకే రూ. 250 కోట్ల ఆస్తులు సంపాదించింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ జన్నత్ జుబేర్ రహ్మానీ. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. అందం, ఆస్తులు, ఫ్యాన్ పాలోయింగ్ పరంగా అగ్ర తారలను వెనక్కు నెట్టింది. అంతేకాదు.. టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువగా ఇన్ స్టాలో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
షారుఖ్ ఖాన్ కు ఇన్ స్టాలో 46 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే.. జన్నత్ జుబైర్ కు ఇన్ స్టాలో 49.7 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2001 ఆగస్టు 29న ముంబైలో జన్మించిన జన్నత్.. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2008లో చాంద్ కే పర్ చలో సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దిల్ మిల్ గయే, కాశీ: అబ్ నా రహే తేరా కాగ్ కోరా, తు ఆషికి, ఫియర్ ఫైల్స్ వంటి షోస్ చేసింది.
అలాగే హిందీలో పలు రియాల్టీ షోలలో పాల్గొంది. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 లక్షలు తీసుకుంది. అలాగే నవ్వు చెఫ్ షోలో ఒక్కో ఎపిసోడ్ కు రూ.2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంది. జన్నత్ వయసు 21 ఏళ్ల వయసులోనే ముంబైలో సొంతంగా ఇల్లు కొనుగోలు చేసింది. సినిమాల్లో పారితోషికమే కాకుండా వ్యాపార రంగంలోనూ రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.250 కోట్లు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..