- Telugu News Photo Gallery Cinema photos Actress Sai Pallavi Shares Black and White Photos Goes Viral
Sai Pallavi: అందం మరింత అద్భుతంగా.. సాయి పల్లవి ఫోటోస్ చూస్తే ఫిదా కావాల్సిందే..
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. అమరన్, తండేల్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు హిందీలో రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోస్ ఫిదా చేస్తున్నాయి.
Updated on: Mar 25, 2025 | 7:32 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్స్ హృదయాలను దొచేస్తున్నాయి.

ఇటీవల అమరన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా, సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎందుకు అంత యాక్టివ్‌గా ఉండరు అని ప్రశ్నించగా.. అంతగా అవసరం లేదని చెప్పుకొచ్చింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ప్రతిసారి ఫోటో పోస్ట్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి ? ఇది అంత ముఖ్యమైనదా?" అని చాలా ఆలోచిస్తారు. మీరు పోస్ట్ చేయడానికి వదిలిపెట్టిన చోట నుండి తిరిగి వస్తారని తెలిపింది.

ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఇందులో సీత పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు రణబీర్ కపూర్ సైతం నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.





























