- Telugu News Photo Gallery Cinema photos Tollywood star heroes like balakrishna venkatesh chiranjeevi not getting super hits in festival season
టాలీవుడ్‌లో విచిత్రం.. స్టార్ హీరోలకు గండం.. ఏంటంటే ??
బాక్సాఫీస్ బద్దలవ్వడానికి బడ్జెట్‌తో పనిలేదా..? స్టార్ పవర్‌తో పనిలేకుండా చిన్న సినిమాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయా..? మీడియం బడ్జెట్ సినిమాలే ఇండస్ట్రీకి సేవియర్స్ అవుతున్నాయా..? స్టార్ హీరోల గ్యాప్.. చిన్న సినిమాలకు హెల్ప్ అవుతుందా లేదంటే చిన్న సినిమాలే స్టార్స్ గ్యాప్ కనబడకుండా చేస్తున్నాయా..? అసలేంటి మ్యాటర్.. చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 25, 2025 | 7:15 PM

ఒకప్పుడు కనీసం నెలకు ఓ స్టార్ హీరో సినిమా వచ్చేది.. కానీ ఇప్పుడంత సినిమా లేదు. ఆర్నెళ్లు కాదు.. ఏడాదికి ఒక్కసారి కూడా మన స్టార్స్ కనిపించట్లేదు. సంక్రాంతికి రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ వచ్చారు..!

అంతే.. 3 నెలలుగా మరో పెద్ద స్టార్ కనిపించిందే లేదు. పండగ సినిమాల్లోనూ చరణ్, బాలయ్య భారీ బడ్జెట్‌తో వస్తే.. వెంకీ మీడియం రేంజ్ సినిమాతో పలకరించారు. వందల కోట్లు పెట్టినా.. సక్సెస్ వస్తుందనే గ్యారెంటీ లేదు.

అదే క్వాలిటీ కంటెంట్ ఉండి.. కాస్త తక్కువ బడ్జెట్‌లో చేసిన సినిమాలు మాత్రం రప్ఫాడిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం విషయంలో ఇదే జరిగింది. 40 కోట్ల లోపు బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం.. 300 కోట్లు వసూలు చేసింది. 25 ఏళ్ళ తర్వాత వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఈ సినిమాతో.

2025లో ఇప్పటి వరకు టాలీవుడ్‌ను కాపాడింది.. కాపాడుతున్నది పెద్ద సినిమాలు కాదు.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బయ్యర్లను బయటపడేసిన సినిమా తండేల్. నాగ చైతన్యకు తొలి 100 కోట్ల సినిమా ఇది. సాయి పల్లవి ఫ్యాక్టర్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం వర్కవుట్ అయింది.

తండేల్ తర్వాత నెల రోజులుగా హిట్ లేని టాలీవుడ్‌ను కాపాడింది కోర్ట్ అనే చిన్న సినిమానే. నాని నిర్మించిన ఈ చిత్రం 50 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ సమ్మర్‌లోనూ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, జాక్ లాంటి మీడియం రేంజ్ సినిమాలే రానున్నాయి. వాటితో పాటు హిట్ 3, హరిహర వీరమల్లు, కింగ్ డమ్ లాంటి భారీ సినిమాలు వస్తున్నాయి. మరి ఇవేం చేయబోతున్నాయో చూడాలిక.





























