AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idupu Kayitham: నాగదుర్గ మొదటి సినిమా ‘ఇడుపు కాయితం’ అంటే అర్థమేంటో తెలుసా? నెట్టింట చర్చ

తెలంగాణ ప్రముఖ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె నటిస్తోన్న మొదటి తెలుగు సినిమా టైటిల్ ను 'ఇడుపు కాగితం' గా గురువారం (జూన్ 26) అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఈ పేరుపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

Idupu Kayitham: నాగదుర్గ మొదటి సినిమా ‘ఇడుపు కాయితం’ అంటే అర్థమేంటో తెలుసా? నెట్టింట  చర్చ
Idupu Kayitham Movie
Basha Shek
|

Updated on: Jun 26, 2026 | 1:04 PM

Share

ప్రియదర్శి హీరోగా, తెలుగు అమ్మాయి నాగదుర్గ హీరోయిన్‌గా ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దొండపాటి వంశీరెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను గురువారం (జూన్ 26) అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘ఇడుపు కాగితం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే ఈ టైటిల్ ప్రకటించినప్పటినుంచి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. అసలు ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా తెలంగాణ మాండలికానికి చెందిన పదం. దీంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ఈ పదం పెద్దగా పరిచయం లేదు. అంతెందుకు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నేటి తెలంగాణ తరానికి కూడా ఈ ఇడుపు కాగితం అంటే అర్థం తెలియదు. దీంతో కొంతమంది నెటిజన్లు ఈ సినిమా పేరుపై సెటైర్లు వేస్తున్నారు? దీనిని తెలుగు భాషలో డబ్ చేస్తారా? సబ్ టైటిల్స్ అయినా పెడతారా? అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు స్పందిస్తున్నారు. ‘ఇడుపు కాగితం’ పదానికి అర్థమేంటో క్లారిటీ ఇస్తున్నారు.

‘ఇడుపు కాయితం’ పదం విషయానికి వస్తే.. ఇందులో ఇడుపు, ఇడుసు అంటే వదలిపెట్టడం అని అర్థం. అంటే విడిచిపెట్టేటప్పుడు రాసుకునే ఒక అగ్రిమెంటే ఈ ఇడుపు కాగితం. కరెక్ట్ గా మన భాషలో చెప్పాలంటే విడాకుల పత్రం అన్నమాట. ఇప్పుడంటే భార్యాభర్తలు విడిపోవాలంటే విడాకులు తీసుకకుంటున్నారు. ఇందు కోసం చట్ట ప్రకారం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్నేళ్ల ముందు కలిసి నడవలేమని నిర్ణయించుకున్న భార్యాభర్తలు పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి ఒక ఒప్పందం పత్రం రాసుకునే వారట. దీన్నే ఇడుపు కాయితం అని పిలిచేవారు. ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని జంటలు ఇడపు కాయితం రాసుకునే విడిపోతున్నారట. అయితే ఈ అర్థం తెలియక కొందరు నెటిజన్లు ఈ సినిమా పేరును ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ మాండలికాన్ని అవమానపర్చొద్దంటూ తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు ట్రోలర్లకు కౌంటర్లు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇడుపు కాయితం సినిమాలో నాగదుర్గ, ప్రియదర్శి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాగదుర్గ మొదటి సినిమా ‘ఇడుపు కాయితం’ అంటే అర్థమేంటో తెలుసా?
నాగదుర్గ మొదటి సినిమా ‘ఇడుపు కాయితం’ అంటే అర్థమేంటో తెలుసా?
జులై నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. అలా చేస్తే భారీగా జరిమానా
జులై నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. అలా చేస్తే భారీగా జరిమానా
తీస్తా తర్వాత మోంగ్లా పోర్టును చైనాకు అప్పగించిన బంగ్లా!
తీస్తా తర్వాత మోంగ్లా పోర్టును చైనాకు అప్పగించిన బంగ్లా!
తిరుమల శ్రీవారి భక్తులూ జాగ్రత్త.. వారిని నమ్మి మోసపోకండి..!
తిరుమల శ్రీవారి భక్తులూ జాగ్రత్త.. వారిని నమ్మి మోసపోకండి..!
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ లుక్.. కాఫీ పొడి చేసే..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ లుక్.. కాఫీ పొడి చేసే..
ఆధార్ ఈమెయిల్ అప్డేట్ ఉచితంగా చేసుకోవడం ఎలా..? ఈ యాప్ ద్వారా..
ఆధార్ ఈమెయిల్ అప్డేట్ ఉచితంగా చేసుకోవడం ఎలా..? ఈ యాప్ ద్వారా..
తరాలు మారిన తరగని ఆస్తులు.. చివరకు అచేతనంగా మారిన హీరోయిన్.
తరాలు మారిన తరగని ఆస్తులు.. చివరకు అచేతనంగా మారిన హీరోయిన్.
ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..
ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..
వారానికి 6 లక్షల రెమ్యునరేషన్‌తో బిగ్‌బాస్ 10లోకి ఈ బ్యూటీ పక్కా!
వారానికి 6 లక్షల రెమ్యునరేషన్‌తో బిగ్‌బాస్ 10లోకి ఈ బ్యూటీ పక్కా!
మద్యం మత్తులో తూగుతూ వచ్చిన వరుడు.. చెంప ఛెళ్లుమనిపించిన వధువు!
మద్యం మత్తులో తూగుతూ వచ్చిన వరుడు.. చెంప ఛెళ్లుమనిపించిన వధువు!