AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ లుక్.. 10 నిమిషాల్లోనే కాఫీ పొడి చేసే మ్యాజిక్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

బ్యూటీ పార్లర్లలో వేల రూపాయల ఖర్చు, గంటల తరబడి ఫేషియల్స్.. ఇకపై ఇవన్నీ దండగ.. కేవలం 10 నిమిషాల్లో ముఖానికి ఇన్‌స్టంట్ గ్లో ఇచ్చే ఒక సూపర్ సీక్రెట్ మన వంటగదిలోనే దాగుంది. ముఖంపై ఉన్న మొండి నల్ల మచ్చలు, ట్యాన్, అలసటను మాయం చేసి.. చర్మాన్ని తళతళా మెరిపించే కాఫీ పొడి ప్యాక్ చేసే మ్యాజిక్ తెలిస్తే అవాక్కవ్వల్సిందే..

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ లుక్.. 10 నిమిషాల్లోనే కాఫీ పొడి చేసే మ్యాజిక్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Coffee Powder Face Pack For Glowing Skin
Krishna S
|

Updated on: Jun 26, 2026 | 12:50 PM

Share

నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో కాలుష్యం, అలసట, ఎండ తీవ్రత వల్ల ముఖం తన సహజమైన మెరుపును కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. దీని కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలు ఖర్చు పెడుతుంటారు చాలా మంది. కానీ మన వంటగదిలో ఉండే కాఫీ పొడితోనే కేవలం 10 నిమిషాల్లో పార్లర్ ఫేషియల్ లాంటి తక్షణ మెరుపును, తాజాదనాన్ని సొంతం చేసుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. కాఫీలో ఉండే కెఫీన్ చర్మానికి రక్త ప్రసరణను పెంచి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మరి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ కాఫీ-హనీ ఫేస్ ప్యాక్ ఎలా చేయాలి..? దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

ఫేస్ ప్యాక్‌కు కావలసిన పదార్థాలు

ఇన్‌స్టంట్ లేదా ఫిల్టర్ కాఫీ పొడి: 1 టేబుల్ స్పూన్

తేనె: 1 టేబుల్ స్పూన్

పెరుగు లేదా పాలు: 1 టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం – అప్లై చేసే ప్రాసెస్:

మిక్సింగ్: ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడి, తేనె, పెరుగు వేసి ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా బాగా కలపాలి.

క్లీనింగ్: ముందుగా మీరు రోజూ వాడే ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవాలి.

స్క్రబ్బింగ్: తయారు చేసుకున్న ప్యాక్‌ను ముఖం, మెడ భాగంలో సమానంగా అప్లై చేసి.. చేతి వేళ్లతో ఒకట్రెండు నిమిషాల పాటు గుండ్రంగా సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల చర్మంపై ఉన్న చనిపోయిన కణాలు తొలగిపోతాయి.

రెస్ట్ – వాష్: మసాజ్ చేసిన తర్వాత ఈ ప్యాక్‌ను ముఖంపై కేవలం 10 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ లేదా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

ఈ కాఫీ ప్యాక్‌తో కలిగే అద్భుత ప్రయోజనాలు..

నల్ల మచ్చలు, ట్యాన్ క్లియర్: కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు సూర్యరశ్మి వల్ల ముఖంపై ఏర్పడే నల్ల మచ్చలను, ట్యాన్‌ను సమర్థవంతంగా తొలగిస్తాయి.

బ్లాక్‌హెడ్స్ మాయం: ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. కాబట్టి ముక్కు చుట్టూ పేరుకుపోయే మొండి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ను సులభంగా క్లీన్ చేస్తుంది.

యాంటీ ఏజింగ్: ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖంపై వచ్చే ముడతలు తగ్గి, చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, మృదువుగా కనిపిస్తుంది.

ఈ ఫేస్ ప్యాక్‌ను పూర్తిగా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతోనే తయారు చేసినప్పటికీ.. మీ చర్మ తత్వానికి ఇది పడుతుందో లేదో తెలుసుకోవడానికి ముఖానికి రాసే ముందు చేతిపై లేదా చెవి వెనుక భాగంలో చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. దీనివల్ల ఎలాంటి అలర్జీలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Follow Us