అరటి ఆకుపై భోజనం చేయడం భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది
TV9 Telugu
పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకల్లో అరటి ఆకులపై ఆహారం వడ్డించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఆరోగ్య రహస్యం కూడా
TV9 Telugu
అరటి ఆకుల్లో సహజంగా పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గ్రీన్ టీతోపాటు అనేక మొక్కల ఆధారిత ఆహారాల్లో కనిపించే పోషక పదార్థాలు
TV9 Telugu
వేడి ఆహారాన్ని అరటి ఆకుపై వడ్డించినప్పుడు ఈ పాలీఫినాల్స్ కొంతమేర ఆహారంలోకి చేరే అవకాశం ఉందని భావిస్తారు. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి
TV9 Telugu
అలాగే అనేక జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. పైగా ఇవి పర్యావరణ హితం కూడా
TV9 Telugu
ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తుండగా, అరటి ఆకులు ఎలాంటి కాలుష్యాన్ని సృష్టించవు. అంతేకాకుండా పాత్రలు కడగడానికి వాడే రసాయనాల అవసరం కూడా ఉండదు
TV9 Telugu
అంతేకాకుండా అరటి ఆకులపై వడ్డించిన ఆహారానికి స్వల్పమైన సహజ సువాసన, ప్రత్యేక రుచి కూడా వస్తుంది. అందువల్ల భోజనం మరింత రుచికరంగా అనిపిస్తుంది
TV9 Telugu
ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయం వంటి అనేక అంశాలను కలగలిపిన అరటి ఆకుపై భోజనం చేసే పద్ధతి ఇప్పటికీ భారతీయ సంస్కృతిలో ఉంది