పుదీనాను రోజూ తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే.. లైట్ తీసుకోవద్దు..

Krishna

25 June 2026

పుదీనా కేవలం వంటల రుచిని పెంచడానికే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, సాధారణ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.

పోషకాల గని

టైమ్‌కు తినకపోవడం వల్ల వచ్చే అజీర్ణం, వికారం, కడుపునొప్పి వంటి సమస్యలకు పుదీనా చక్కటి పరిష్కారం. ఇది జీర్ణరసాల స్రావాన్ని పెంచి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. భోజనం తర్వాత పుదీనా తినడం మంచిది.

జీర్ణక్రియకు అమృతం

మసాలాలు ఎక్కువ తినడం, నిద్రలేమి వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. పుదీనాకు చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. ఇది కడుపులోని యాసిడ్‌ను సమతుల్యం చేసి గుండెల్లో మంట, అసిడిటీ నుండి రిలీఫ్ ఇస్తుంది.

అసిడిటీ, కడుపులో మంట

చెడు ఆహార అలవాట్ల వల్ల కడుపులో ఉబ్బరంగా అనిపిస్తుంది. పుదీనా జీర్ణవ్యవస్థను కూల్ చేసి, ప్రేగులలోని గ్యాస్‌ను తగ్గిస్తుంది. ఈ ఆకులను నమలడం లేదా పుదీనా టీ తాగడం వల్ల ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

గ్యాస్, కడుపు ఉబ్బరం

శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. పుదీనాలో ఐరన్ లభిస్తుంది కాబట్టి ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి నీరసం, అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా శాకాహారులకు పుదీనా ఒక మంచి అనుబంధ ఆహారం.

రక్తహీనత

పుదీనా శ్వాసకోశ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇది జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం ఇస్తుంది. దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేసి, నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.

శ్వాసకోశ సమస్యలు

కొత్తిమీర, వెల్లుల్లి, నిమ్మరసంతో కలిపి చేసే పుదీనా చట్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చలికాలంలో పుదీనా టీ, ఎండకాలంలో డీహైడ్రేషన్ నుండి కాపాడే పుదీనా సిరప్, సలాడ్లు, రైతాల రూపంలో దీనిని తీసుకోవచ్చు.

 వివిధ రూపాల్లో

పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, దీనిని పరిమితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే కొంతమందిలో అసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది.  

అతి సర్వత్ర వర్జయేత్