AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు ఈమెయిల్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క యాప్ ద్వారా మాత్రమే.. ట్రై చేయండి..

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. యూజర్లు సులభంగా ఆధార్ సేవలను వినియోగించుకునేందుకు యూఐడీఏఐ అనేక సేవలు అందుబాటులో తీసకొచ్చింది. ఇటీవల కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యాప్ వాడేవారికి మరో ఊరట కలిగించింది.

Aadhaar Card: ఆధార్ కార్డు ఈమెయిల్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క యాప్ ద్వారా మాత్రమే.. ట్రై చేయండి..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Jun 26, 2026 | 12:36 PM

Share

ఆధార్ కార్డు ఉన్నవారికి యూఐడీఏఐ భారీ శుభవార్త అందించింది. ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు ఆధార్ కార్డుకు ఈమెయిల్ మార్చుకునేందుకు రూ.75 ఫీజు వసూలు చేస్తోంది. ఇప్పుడు ఆ ఫీజును మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఉచితంగా మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. రాబోయే ఆరు నెలల పాటు ఆధార్ కార్డుదారులు ఉచితంగా ఈమెయిల్ ఐడీని అప్డేట్ చేసుకోవచ్చన్నమాట. ఈ అవకాశాన్ని ఆధార్ యూజర్లు ఉపయోగించుకోవాలని సూచించింది. కేవలం ఆధార్ యాప్ ద్వారా మెయిల్ ఐడీని అప్డేట్ చేసుకునేవారికి మాత్రమే ఉచిత సదుపాయం అమల్లో ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అనంతరం ఫిబ్రవరిలో ఈ యాప్‌ కొత్త వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. ఎంఆధార్ యాప్ స్థానంలో ఈ కొత్త యాప్ తీసుకొచ్చింది. కొత్త యాప్‌లో అనేక కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ బేస్డ్ ఆధార్ వెరిఫికేషన్, పేపర్ లెస్ ఆధార్ ధృవీకరణ, మొబైల్ నెంబర్ అప్డేట్ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈమెయిల్ ఈ యాప్ ద్వారా ఉచితంగా మార్చుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఆధార్ కార్డుకు ఈమెయిల్ అప్డేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. మీ మొబైల్ నెంబర్ పనిచేయని సమయంలో మెయిల్ ఐడీ ద్వారా ఓటీపీలు అందుకోవచ్చు. అలాగే ఇతర అప్ డేట్స్, నోటిఫికేషన్లను పొందవచ్చు. సిమ్ పనిచేయని సందర్భంలో మెయిల్ ఐడీ ఉపయోగపడుతుంది. ప్రజలకు సులభంగా, సురక్షితంగా ఆధార్ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది.

మెయిల్ ఐడీ అప్డేట్ చేసుకోవడం ఎలా..?

-మొబైల్‌లో ఆధార్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి -ఎం పిన్, బయెమెట్రిక్స్ ద్వారా ఆధార్ యాప్‌లోని లాగిన్ అవ్వండి -ఈమెయిల్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోండి -మెయిల్ ఐడీ వివరాలు నమోదు చేయండి -వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి -అనంతరం మీ మెయిల్ అడ్రస్ అప్డేట్ అవుతుంది

కొత్త ఆధార్ యాప్ ఫీచర్లు

కొత్త ఆధార్ యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అడ్రస్ అప్డేట్, మొబైల్ నెంబర్ అప్డేట్, పేపర్ లెస్ ఆధార్ వెరిఫికేషన్, ఆధార్ బయెమెట్రిక్ లాక్ లేదా అన్ లాక్, మస్క్‌డ్ ఆధార్ డౌన్ లోడ్ వంటి అన్ని సేవలు పొందవచ్చు. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ఇంటి వద్ద నుంచే మీ ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు.

Follow Us
జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో..
జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో..
Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం
Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం
సిబిల్ స్కోర్ వర్సెస్ క్రెడిట్ స్కోర్.. అసలు తేడా ఏమిటి?
సిబిల్ స్కోర్ వర్సెస్ క్రెడిట్ స్కోర్.. అసలు తేడా ఏమిటి?
రామాయణం సినిమా తారలకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ అంటే..
రామాయణం సినిమా తారలకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ అంటే..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు!
మగాళ్లలో శక్తికి.. దీర్ఘాయుష్షుకు అద్భుత ఫలం.. రోజుకు రెండు తింటే
మగాళ్లలో శక్తికి.. దీర్ఘాయుష్షుకు అద్భుత ఫలం.. రోజుకు రెండు తింటే
ఉప్పొంగుతున్న గోదారి.. లంక గ్రామాల పరిస్థితి ఇదే
ఉప్పొంగుతున్న గోదారి.. లంక గ్రామాల పరిస్థితి ఇదే
విజయ్ దళపతి గురించి కొడుకు జాసన్ సంజయ్ కామెంట్స్..
విజయ్ దళపతి గురించి కొడుకు జాసన్ సంజయ్ కామెంట్స్..
మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం..
మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం..
పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే..
పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే..