Jason Sanjay: మా నాన్న ఇచ్చిన సలహా అదే.. ఆ మాట నాకు ఎంతో ఇష్టం.. విజయ్ దళపతి గురించి కొడుకు కామెంట్స్..
దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో నటుడిగా తనదైన ముద్ర వేసిన విజయ్ దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేస్తున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సీట్లు గెలుచుకున సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే.. విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ ఇప్పుడు దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

కొన్ని నెలలుగా తమిళనాడు సీఎం విజయ్ ఫ్యామిలీ విషయాలు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మరోవైపు తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో సంచలనం సృష్టించిన విజయ్.. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ తెరకెక్కిస్తున్న సినిమా సిగ్మా. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్లో పాల్గొంటున్నాడు జాసన్ సంజయ్. ఈ క్రమంలోనే తాజాగా జాసన్ సంజయ్ మొదటి సారి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తన ఫ్యామిలీ గురించి జాసన్ ఏం చెప్పాడో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
నిజానికి జాసన్ సంజయ్ చిన్నప్పుడే విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ వెట్టైక్కారన్ చిత్రంలోని నా అదిచ్చ తంగ మాటే అనే మాస్ సాంగ్‌లో కనిపించాడు. ఇందులో జాసన్ సంజయ్ మ్యాచింగ్ డ్రెస్ ధరించి తన తండ్రితో కలిసి డ్యాన్స్ చేశాడు. తాజాగా తన ఫస్ట్ ఇంటర్వ్యూలో జాసన్‌ను డ్యాన్స్ గురించి అడిగినప్పుడు.. “డ్యాన్స్ సాధనతో వస్తుంది. నేను సహజంగా డ్యాన్స్ చేసే రకం కాదు. ఇంట్లో అబ్బాయిలతో కలిసి కొద్దిగా డ్యాన్స్ చేయగలను” అన్నాడు. మీకు డ్యాన్స్ రాకుండా ఎలా ఉంటుంది. అది మీ రక్తంలోనే ఉంది. మీకు 5 శాతం డ్యాన్స్ వచ్చినా అది గొప్ప విషయమే అని సదరు యాంకర్ అనగా.. దయచేసి దానితో నన్ను పోల్చవద్దు అని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
అంతేకాకుండా తన తండ్రి సూపర్ హిట్ ‘వెట్టైకారన్’ సినిమా షూటింగ్‌ను కూడా గుర్తుచేసుకున్నారు జాసన్ సంజయ్. “నేను ఆ పాటలోకి ఎలా వచ్చానో నాకు గుర్తులేదు. మేము అక్కడికి వెళ్లి కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకున్నాము. ఆయన ‘యాక్షన్’ అనగానే, నేను వెళ్లి మా నాన్నను కౌగిలించుకున్నాను. అప్పుడు నా వయసు 8-9 ఏళ్లు. నేను దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆ రోజు షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది” అని చెప్పుకొచ్చారు. తన తండ్రి నుండి నేర్చుకున్న ఒక విషయం ఏమిటని అడగ్గా.. , “నాకు ఇష్టమైనది చేయడానికి మా నాన్న నన్ను ప్రోత్సహించారు. నాకు కూడా అదే ఇష్టం. నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోమని ఆయన నాకు సలహా ఇచ్చారు” అని అన్నారు. ప్రస్తుతం జాసన్ సంజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
