AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Hema : ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆ రెండు సినిమాలతోనే నా క్రష్ అయిపోయాడు.. నటి హేమ..

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నటి హేమ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ హీరో పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. అలాగే ఆయనంటే తనకు క్రష్ అని చెప్పారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అంటే గౌరవం అని తెలిపారు.

Actress Hema : ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆ రెండు సినిమాలతోనే నా క్రష్ అయిపోయాడు.. నటి హేమ..
Hema
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2026 | 9:05 PM

Share

టాలీవుడ్ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున , చిరంజీవి పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. నాగార్జునను తాను తన “క్రష్”గా భావిస్తానని, చిరంజీవి గారిని మాత్రం ఒక కుటుంబ పెద్దగా, గౌరవంగా చూస్తానని ఆమె తెలిపారు. హేమ తన ఇంటి పక్కన ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఆమె తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా నాగార్జునను ఆహ్వానించానని.. మొదట ఆయన లంచ్ కు రానని, పది నిమిషాలు మాత్రమే వచ్చి వెళ్తానని చెప్పినప్పటికీ, తాను ఎంతో ఆశగా చేపల పులుసు, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, రసం వంటి ఐదు రకాల వంటకాలతో విందు సిద్ధం చేసినట్లు గుర్తు చేసుకున్నారు. నాగార్జున టేబుల్ నిండా ఉన్న వంటకాలను చూసి “ఎందుకు ఇన్ని చేసావు? అసలు లంచ్ కు రానన్నాను కదా?” అని అడిగారని, అయితే తాను కొసరి కొసరి వడ్డించానని హేమ వివరించారు. అది తన జీవితంలో చాలా గుర్తుండిపోయే రోజు అని ఆమె పేర్కొన్నారు.

నాగార్జున సినిమాలైన గీతాంజలి, శివ చూసిన తర్వాత ఆయన పట్ల ఎంతో అభిమానం పెరిగిందని, ఆయనంటే తనకు పిచ్చి ప్రాణమని హేమ చెప్పారు. అప్పట్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ లు లేని రోజుల్లో, నాగార్జున గారు వచ్చిన తర్వాతే అలాంటి రొమాన్స్ సినిమాల్లో చూడటం మొదలైందని ఆమె గుర్తుచేసుకున్నారు. చిరంజీవి గారిని ఒక బావగారు, ఇంటికి పెద్ద దిక్కుగా భావిస్తానని, ఆయనంటే ఒక గౌరవం ఉందని, అయితే నాగార్జున అంటే ఒక బాయ్ ఫ్రెండ్ లాంటి క్రష్ అని హేమ స్పష్టం చేశారు.

వారసుడు సినిమా షూటింగ్ సమయంలో నాగార్జునతో తన పరిచయం మొదలైందని హేమ తెలిపారు. ఆ సినిమా సమయంలో నాగార్జున, నగ్మా, హేమ పక్కపక్కన సీన్లు చేసేవారని, నగ్మాకు తెలుగు రాకపోయినా వారితో స్నేహంగా ఉండేవారని చెప్పారు. ఆ తర్వాత గోపింటి అల్లుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, నాగార్జున ఏడు ఎకరాల స్టూడియోలో షూటింగ్ జరుగుతుందని, రోజు ఆయనను దూరం నుంచి చూసేదాన్నని హేమ వెల్లడించారు. తన స్నేహితురాలు సంగవి, “నాగార్జునను చూస్తూ కూర్చున్నావు కదా, ఆయనంటే నీకు ఎంత ఇష్టమో తెలుసా” అని నాగార్జున ముందు చెప్పిందని, దాంతో తాను కాస్త టెన్షన్ పడ్డానని గుర్తుచేసుకున్నారు. నాగార్జున గారు అప్పుడు గోరింటాకు పెట్టుకునేవారని, దాన్ని గురించి కూడా ఆ రోజు సంభాషణ జరిగిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

హేమ, నాగార్జున..

Hema, Nagarjuna

Hema, Nagarjuna

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

Follow Us