ఒక మిక్సీ జార్లో వేయించిన ఎండు మిరపకాయలు, వేయించిన మెంతులు వేసి మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు దీనిలో 200 గ్రాముల కల్లుప్పు, అర కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి తిరిగి గ్రైండ్ చేయాలి. ఈ కారం మిశ్రమాన్ని వేయించుకున్న గోంగూరలో వేసుకోవాలి. ఉడికించిన చింతపండును కూడా మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి గోంగూర మిశ్రమంలో కలపాలి.ఇప్పుడు అన్ని పదార్థాలను బాగా కలిపి, ఒక చిన్న రోలు తీసుకుని, కొద్దికొద్దిగా గోంగూర మిశ్రమాన్ని వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోలు లేనివారు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, అయితే మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకుండా, కొంచెం ఆకులాకులుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే గోంగూర పచ్చడి రుచిగా ఉంటుంది. దంచుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం రెండు కప్పుల పల్లీ నూనె తీసుకోండి. గోంగూర పచ్చడికి పల్లీ నూనె అద్భుతమైన రుచిని ఇస్తుంది. నూనె కొద్దిగా కాగాక, 2 టీస్పూన్ల ఆవాలు, 2 టీస్పూన్ల పచ్చి శనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, పావు టీస్పూన్ మెంతులు వేసి, పప్పులు కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు, 10-12 ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి 30 సెకన్లు వేయించి స్టవ్ ఆపేయండి. ఎండు మిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి.