AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్ కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్‌.. కానీ వారికి మాత్రమే..!

WhatsApp AI Image Editor: ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారు ఈ విభాగంలో ఫోటోను షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఆ విభాగంలో ఫోటోను పెద్దదిగా చేయడం సహా, ఫోటోలను ఎడిట్..

WhatsApp: వాట్సాప్ కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్‌.. కానీ వారికి మాత్రమే..!
Whatsapp
Subhash Goud
|

Updated on: Nov 06, 2026 | 9:03 PM

Share

WhatsApp AI Image Editor: మెటా ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఆ క్రమంలో ఇప్పుడు ఐఫోన్ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేయడానికి కృషి చేస్తోంది . అదేమిటంటే ఐఫోన్ వినియోగదారులు తమ ఫోటోలను సులభంగా ఎడిట్ చేసుకునేందుకు వీలుగా ఏఐ ఇమేజ్ ఎడిట్ ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది . ఆ ఫీచర్ ఏమిటి, దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

వాట్సాప్ కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పరిచయం:

ఫోటోలు తీసే చాలా మందికి ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఇంకాస్త బాగుండాల్సింది అనే ఆలోచన వస్తుంటుంది. అది పెద్ద సమస్యేమీ కాదు. మీరు యాప్‌ల ద్వారా దాన్ని ఎడిట్ చేసి, మీకు నచ్చినట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకోవచ్చు. కానీ, వాట్సాప్ యాప్ నుండే మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకునే అవకాశం మీకు ఉంటే ఎలా ఉంటుంది? మెటా ఇప్పుడు వాట్సాప్‌లో అలాంటి ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది.

కొత్త ఫీచర్: WABetaInfo ఏమి చెబుతోంది?

WABetaInfo ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. దీనికోసం మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగిస్తోంది . ఇది ఫోటోను మార్చకుండా, దాని వైపును మార్చడం, అదనపు ఫోటోలను జోడించడం, ఫోటోను పెద్దదిగా చేయడం వంటి మార్గాలను అన్వేషిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారు ఈ విభాగంలో ఫోటోను షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఆ విభాగంలో ఫోటోను పెద్దదిగా చేయడం సహా, ఫోటోలను ఎడిట్ చేసే ఫీచర్లను మీరు చూడగలరు. గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు ఏదైనా ఫోటోను ఎంచుకున్న తర్వాత మెటా ఏఐ కొన్ని నిమిషాల్లోనే మీ ఫోటో విస్తరించిన వెర్షన్‌ను మీకు అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Basement Brick: బేస్‌మెంట్‌ నిర్మాణంలో ఎన్ని ఇటుకలు అవసరం.. సివిల్‌ ఇంజనీర్‌ పద్దతిలో లెక్కలు ఇవే..!

ఇది కూడా చదవండి: Best Smartphones: రూ.15 వేలలోపు 5 బెస్ట్‌ 5G స్మార్ట్‌ ఫోన్లు ఇవే.. అద్భుతమైన ఫీచర్స్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వాట్సాప్ కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్‌.. కానీ వారికి మాత్రమే..!
వాట్సాప్ కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్‌.. కానీ వారికి మాత్రమే..!
కాస్త కారంగా, ఘాటుగా.. కోడిగుడ్డు పచ్చడి ఇలా పెడితే అదిరిపోద్దీ
కాస్త కారంగా, ఘాటుగా.. కోడిగుడ్డు పచ్చడి ఇలా పెడితే అదిరిపోద్దీ
అందుకే శూర్పణఖ పాత్ర చేశా.. ఓపెన్ గా చెప్పేసిన రకుల్
అందుకే శూర్పణఖ పాత్ర చేశా.. ఓపెన్ గా చెప్పేసిన రకుల్
మనుషులనే ఆశ్చర్యపరిచే జ్ఞాపకశక్తి.. ఈ జంతువుల గురించి తెలుసా? 
మనుషులనే ఆశ్చర్యపరిచే జ్ఞాపకశక్తి.. ఈ జంతువుల గురించి తెలుసా? 
పులిహోర గోంగూర నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే సంవత్సరం పొడవునా నిల్వ
పులిహోర గోంగూర నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే సంవత్సరం పొడవునా నిల్వ
 కుక్కలకు పచ్చి చికెన్ పెడితే ప్రమాదమా?
 కుక్కలకు పచ్చి చికెన్ పెడితే ప్రమాదమా?
ఒక తండ్రి గుండె కోత నుంచి వెలిగిన ప్రాణ జ్యోతి
ఒక తండ్రి గుండె కోత నుంచి వెలిగిన ప్రాణ జ్యోతి
బంగారం కొంటున్నారా? జాగ్రత్త.. మార్కెట్లో కొత్త తరహా కల్తీ మోసం
బంగారం కొంటున్నారా? జాగ్రత్త.. మార్కెట్లో కొత్త తరహా కల్తీ మోసం
బేస్‌మెంట్‌ నిర్మాణంలో ఎన్ని ఇటుకలు అవసరం.. సివిల్‌ ఇంజనీర్‌ పద్ద
బేస్‌మెంట్‌ నిర్మాణంలో ఎన్ని ఇటుకలు అవసరం.. సివిల్‌ ఇంజనీర్‌ పద్ద
సీతాఫలం తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆశ్చర్యపోయే నిజాలు..
సీతాఫలం తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆశ్చర్యపోయే నిజాలు..