AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Smartphones: రూ.15 వేలలోపు 5 బెస్ట్‌ 5G స్మార్ట్‌ ఫోన్లు ఇవే.. అద్భుతమైన ఫీచర్స్‌..!

Best Smartphones: ప్రజలు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఇటీవల దాదాపు అన్ని కంపెనీలు వాటి ధరలను పెంచాయి. ఫలితంగా ఉత్తమమైన ఎంపికను ఎంచుకోవడంలో ప్రజలు సతమతమవుతున్నారు. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌తో సహా పలు ప్లాట్‌ఫారమ్‌లలో రూ.15,000 లోపు..

Best Smartphones: రూ.15 వేలలోపు 5 బెస్ట్‌ 5G స్మార్ట్‌ ఫోన్లు ఇవే.. అద్భుతమైన ఫీచర్స్‌..!
Best Smartphones
Subhash Goud
|

Updated on: Nov 06, 2026 | 4:46 PM

Share

Best Smartphones: ప్రజలు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఇటీవల దాదాపు అన్ని కంపెనీలు వాటి ధరలను పెంచాయి. ఫలితంగా ఉత్తమమైన ఎంపికను ఎంచుకోవడంలో ప్రజలు సతమతమవుతున్నారు. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌తో సహా పలు ప్లాట్‌ఫారమ్‌లలో రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. 6000mAh బ్యాటరీలు, శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌లలో కొన్నింటిని ఈరోజు చూద్దాం.

  1. HMD వైబ్2 5G ధర రూ.11,999. ఇది 4GB RAM , 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 6000mAh బ్యాటరీ, వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందువైపు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
  2. ఫ్లిప్‌కార్ట్‌లో ఏఐ+ ప్లస్ 2 ధర రూ.10,999గా ఉంది. ఇది 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
  3. లావా బోల్డ్ N2 5G 6000mAh బ్యాటరీతో ఉంటుంది. దీని ధర రూ.13,998, ఇది 4GB RAM, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. నీటి నిరోధకతను సూచించే IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.
  4. పోకో సి85ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్‌లో 6300mAh బ్యాటరీ ఉంది. ఇందులో 6.8-అంగుళాల డిస్‌ప్లే, 32-మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని ధర రూ.13,549. ఇది యునిసోక్ టి8300 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
  5. శాంసంగ్ గెలాక్సీ M07 అమెజాన్ ఇండియాలో జాబితా చేసింది. 4GB RAM, 64GB ఇంటర్నల్‌ స్టోరేజీ గల వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us