AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basement Brick: బేస్‌మెంట్‌ నిర్మాణంలో ఎన్ని ఇటుకలు అవసరం.. సివిల్‌ ఇంజనీర్‌ పద్దతిలో లెక్కలు ఇవే..!

Basement Brick: బేస్‌మెంట్‌కు ఇటుకల సంఖ్యను లెక్కించి సమయం వృథా చేయకుండా, సివిల్ ఇంజనీర్ సూచించిన సులభ ఫార్ములాను ఉపయోగించండి. రన్నింగ్ ఫీట్, ఎత్తు, గోడ మందంతో ఘనపుటడుగులను లెక్కించి, దానిని 12తో గుణించడం ద్వారా అవసరమైన మొత్తం ఇటుకలను తక్షణమే తెలుసుకోవచ్చు..

Basement Brick: బేస్‌మెంట్‌ నిర్మాణంలో ఎన్ని ఇటుకలు అవసరం.. సివిల్‌ ఇంజనీర్‌ పద్దతిలో లెక్కలు ఇవే..!
Basement Brick Calculation
Subhash Goud
|

Updated on: Nov 06, 2026 | 8:38 PM

Share

Basement Brick Calculation: నిర్మాణ పనుల్లో ఇటుకల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడం అనేది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వ్యర్థాలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మేస్త్రీలు లేదా కార్మికులు ఇటుకలను ఒకటి రెండుగా లెక్కించడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. అయితే, కాకినాడకు చెందిన ఓ సివిల్ ఇంజనీర్ బేస్‌మెంట్ నిర్మాణానికి అవసరమైన ఇటుకలను త్వరగా, ఖచ్చితంగా లెక్కించేందుకు ఒక సులభమైన ఇంజనీరింగ్ ఫార్ములాను వివరించారు. ఈ పద్ధతి ప్రకారం, ముందుగా బేస్‌మెంట్ మొత్తం క్విబిక్ ఫీట్ (Cubic Feet – CFT) పరిమాణాన్ని కనుగొనాలి. దీనికోసం కింది ఫార్ములాను ఉపయోగించాలి.

క్విబిక్ ఫీట్ (CFT) = రన్నింగ్ ఫీట్ × ఎత్తు × గోడ మందం

ఉదాహరణకు ఒక బేస్‌మెంట్ రన్నింగ్ ఫీట్ 160 అడుగులు, ఎత్తు 4 అడుగులు, గోడ మందం 9 అంగుళాలు (ఇది ఫీట్లలో 0.75 అడుగులు) అనుకుంటే లెక్క ఇలా ఉంటుంది: 160 (రన్నింగ్ ఫీట్) × 4 (ఎత్తు) × 0.75 (గోడ మందం) = 480 క్విబిక్ ఫీట్ (CFT). ఒక క్విబిక్ ఫీట్‌కు సగటున 12 ఇటుకలు అవసరం అవుతాయి. అందుకే మొత్తం ఇటుకల సంఖ్యను కనుగొనడానికి క్విబిక్ ఫీట్ పరిమాణాన్ని 12తో గుణించాలి:

మొత్తం ఇటుకలు = ఘనపుటడుగులు (CFT) × 12

పై ఉదాహరణను కొనసాగిస్తూ: 480 (CFT) × 12 = 5,760 ఇటుకలు.

ఈ సులభమైన ఇంజనీరింగ్ ఫార్ములాను ఉపయోగించి, నిర్మాణ పనుల్లో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇది కేవలం బేస్‌మెంట్ నిర్మాణానికే కాకుండా, గోడల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను లెక్కించేందుకు కూడా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Best Smartphones: రూ.15 వేలలోపు 5 బెస్ట్‌ 5G స్మార్ట్‌ ఫోన్లు ఇవే.. అద్భుతమైన ఫీచర్స్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బేస్‌మెంట్‌ నిర్మాణంలో ఎన్ని ఇటుకలు అవసరం.. సివిల్‌ ఇంజనీర్‌ పద్ద
బేస్‌మెంట్‌ నిర్మాణంలో ఎన్ని ఇటుకలు అవసరం.. సివిల్‌ ఇంజనీర్‌ పద్ద
సీతాఫలం తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆశ్చర్యపోయే నిజాలు..
సీతాఫలం తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆశ్చర్యపోయే నిజాలు..
డీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిల్..!
డీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిల్..!
దీపావళికి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారా? ట్యాక్స్ రూల్స్ ఇవే!
దీపావళికి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారా? ట్యాక్స్ రూల్స్ ఇవే!
బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్
ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి
ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి
తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా?జబర్దస్త్‌ ఫైమాపై విమర్శలు
తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా?జబర్దస్త్‌ ఫైమాపై విమర్శలు
కమ్మగా కడుపు నిండా తినాలా? అయితే ఈ రిసిపీ ట్రై చేయండి!
కమ్మగా కడుపు నిండా తినాలా? అయితే ఈ రిసిపీ ట్రై చేయండి!
ఓటింగ్‌లో ఊహించని మలుపులు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
ఓటింగ్‌లో ఊహించని మలుపులు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇవే.. !
CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇవే.. !