Bigg Boss Telugu 10: అతను చాలా మంచి వాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్.. వీడియో
జిమ్ జిమ్ తార పాటతో ఒక్క సారిగా ఫేమస్ అయిపోయింది లక్ష్మీ దేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ లక్ష్మీ పాటలు, వీడియోలే సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ పెద్దావిడ బిగ్ బాస్ తెలుగు 10 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకంది. తొమ్మిదో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతు మాస్టర్, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ ఈ వారం ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంంటున్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేదా ఇద్దరు బయటకు వెళ్లిపోతారా? అన్నది ఆదివారం (అక్టోబర్ 08) ఎపిసోడ్ తో తెలియనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ రేసులో త్రిగుణ్ టాప్ లో ఉన్నాడు. అతనికి పోటీగా ఉన్న రోహిత్ నాయుడు కూడా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడు హౌస్ లో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ పోటీ ఏర్పడింది. వీరిద్దరి మధ్యే టైటిల్ పోరు నడుస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు పలువురు బిగ్ బాస్ రివ్యూయర్లు, సెలబ్రిటీలు బిగ్ బాస్ 10 పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. టాప్-5లో ఎవరెవరు ఉంటారో తమ దైన శైలిలో అంచనాలు వేస్తున్నారు. అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటేసి గెలిపించండని సోషల్ మీడియా వేదికగా పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. తాజాగా జిమ్ జిమ్ తార సింగర్ లక్ష్మీ దేవీ కూడా ఓ కంటెస్టెంట్ కు మద్దతుగా వీడియో రిలీజ్ చేసింది.
జిమ్ జిమ్ తార పాట పాడిన సింగర్ విషయానికి వస్తే ఈమె పూర్తి పేరు గోకుల లక్ష్మీదేవి. సోషల్ మీడియాలో ఆమెని లక్ష్మీ ఆంటీగా పిలుస్తుంటారు. లక్ష్మీ రాయలసీమ లోని కర్నూల్ ప్రాంతానికి చెందినదని తెలుస్తోంది. జిమ్ జిమ్ తార..జిలేబి తేరా చిన్నోడా పాట పాట మాత్రమే కాకుండా గతంలో అత్తరు సాయిబో రారా అంటూ ఎన్నో పాటలు పాడి బాగా ఫేమస్ అయ్యింది లక్ష్మీదేవి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 10 పై మాట్లాడిన లక్ష్మీ దేవి సుధీర్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారామె. ‘మన రాయలసీమ ముద్దు బిడ్డ సుధీర్ చాలా మంచివాడు. అతనికి అందరూ వోటు వేయాలి. మంచి వాడైన సుధీర్ ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని స్పెషల్ రిక్వెస్ట్ చేశారు లక్ష్మీదేవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది.
లక్ష్మీ ఆంటీ వీడియో..
View this post on Instagram
ఇక సుధీర్ విషయానికి వస్తే..ఇతనిది కూడా రాయలసీమ ప్రాంతమే. ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఆదాన్ మీడియా, సుధీర్ టాక్స్ ద్వారా యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ 10లోకి అడుగు పెట్టి అదరగొడుతున్నాడు. మరి బిగ్ బాస్ 10లో సుధీర్ ఎక్కడివరకు వెళతాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




