OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ప్రియమణి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. IMDBలో టాప్ రేటింగ్.. ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో సరి కొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో టాలీవుడ్ నటి ప్రియమణి కీలక పాత్ర పోషించింది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రాంపాల్ మరో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నాడు.

సాధారణంగా ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలంటే కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. ఇంకా కొన్ని సినిమాలు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తో పాటు అదనంగా డబ్బులు చెల్లించాలి. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ లేకున్నా, డబ్బులు కట్టకుండా కొత్త సినిమాలు చూసేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఒక కొత్త ప్లాట్ ఫామ్ తెచ్చింది. అదే ‘ఫ్రీ ఆన్ జీ 5′(Free on ZEE5). దీనిలో భాగంగా ప్రతి వారం కొన్ని కొత్త సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జీ5. ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చూసే అవకాశం కల్పిస్తోంది. అలా బుధవారం (నవంబర్ 04) కూడా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను డైరెక్టుగా ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఇందులో టాలీవుడ్ నటి ప్రియమణి కీలక పాత్ర పోషించింది. అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ మరో ప్రధాన పాత్ర పోషించాడు. థియేటర్లలో రిలీజ్ కాని ఈ మూవీ ఇప్పుడు జీ5లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక సిన్సియర్ ఐపీఎస్ అధికారి చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది. కొంతమంది స్నేహితులకు సంబంధించిన అనుమానాస్పద సంఘటనలు, కనిపించకుండా పోయిన రూ.5 కోట్ల డబ్బు ఈ కథలో కీలకంగా ఉంటాయి. ఈ కేసును విచారించే క్రమంలో ఎన్నో రహస్యాలు, మోసాలు బయటపడతాయి. మరి అసలు ఆ రూ.5 కోట్ల డబ్బు ఎవరిది? ఎలా మాయమైంది? ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు? అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
2014లో మలయాళంలో వచ్చిన సెవెంత్ డే మూవీ అక్కడ సంచలన విజయం సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో హీరోగా నటించాడు. శ్యామ్ ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించింది. ఈ సూపర్ హిట్ సినిమానే బ్లైండ్ గేమ్ గా హిందీలో రీమేక్ చేశారు. మలయాళం, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శివన్.. ఈ చిత్రాన్ని క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. విషాదకరమైన విషయమేమిటంటే.. సంగీత్ శివన్ దర్శకత్వం వహించిన చివరి సినిమా ఇదే. ఆయన మరణానంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని ఎంజాయ్ చేయవచ్చు. మంచి ఇంటెన్స్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ‘బ్లైండ్ గేమ్’ మూవీపై ఒక లుక్కేసుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




