వాళ్లు నాశనం అవ్వాలనే కోరుకుంటా.. దేవుడికి రోజుకు వందసార్లు మొక్కుతా.. చలాకీ చంటి..
"దేవుడు ఉంటే వాళ్లు నాశనం అవ్వాలి" అంటూ చలాకీ చంటి తన జీవితంలో ఎదురైన మోసాలు, సినీ పరిశ్రమలోని కష్టాలు, వ్యక్తిగత బాధలను ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా పంచుకున్నారు. అవకాశాలు కోల్పోవడం వెనుక ఉన్న కారణాలు, పరిశ్రమలోని భజన సంస్కృతి, అనుభవాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు చలాకీ చంటి. ఆ తర్వాత సినిమాల్లో హాస్య నటుడిగా కనిపించిన చంటి.. ఇప్పుడు అంతగా మూవీస్ చేయడం లేదు. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు చలాకీ చంటి మాట్లాడుతూ తన జీవితంలోని బాధలు, మోసాలు, సినీ పరిశ్రమలో ఎదురైన అనుభవాలపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నా ఎదుగుదలను అడ్డుకున్నవారు, నాకు జరగాల్సిన సమయాల్లో అవకాశాలు ఆగిపోవడానికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ కారణమైన ప్రతి ఒక్కడూ సర్వనాశనం అయిపోవాలి” అని ఆగ్రహంగా, శాపనార్థం చేస్తూ మాట్లాడారు. తన కడుపుమండితోనే ఈ మాటలు చెబుతున్నానని, ఎదుటివారికి చెడు కోరుకోవద్దు అని చెప్పడం తప్పు అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన చెడును కోరుకున్నప్పుడు తాను ఎందుకు వారి చెడును కోరుకోకూడదని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం మానవ సహజ స్వభావమని, “నేను బాగుంటేనే నువ్వు బాగుండాలని కోరుకుంటా, నేను నాశనం అవ్వడానికి కారణమైనవాడు నాశనం అవ్వాలి” అని ఆయన స్పష్టం చేశారు.
తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, ముఖ్యంగా ఇండస్ట్రీలో తనకు “ఈగో” ఉందనే అపవాదుపై చంటి వివరణ ఇచ్చారు. ఒక ఆర్టిస్టుగా ప్రతిసారీ వంగి వంగి రావడం సాధ్యం కాదని, అది కొందరికి నచ్చకపోవచ్చని అన్నారు. కో-డైరెక్టర్లు లేదా ఇతర టీమ్ సభ్యులు తమకు నచ్చకపోతే అవకాశాలను ఎలా అడ్డుకుంటారో తెలిపారు. “నెంబర్ రాసుకున్నాను భయ్యా, తొందరగా ఫోన్ వస్తుంది” అని చెప్పి, ఆ అవకాశాన్ని వేరొకరికి ఎలా కట్టబెడతారో ఆయన ఉదాహరణలతో చెప్పారు. కో-డైరెక్టర్ లేదా టీమ్ సభ్యులకు తనను నచ్చకపోతే, లేదా వారికీ వేరొకరితో వంద రకాల లావాదేవీలు ఉంటే తన స్థానంలో వేరొకరిని తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
కొత్త డైరెక్టర్లతో పని చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలను చలాకీ చంటి ప్రస్తావించారు. తనకు ఏజ్ తక్కువ ఉన్నా, తన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి హిట్ కొట్టి డైరెక్టర్లు అయినవారు కొంతమంది అన్న అని పిలుస్తారని, మరికొందరు “అన్న వద్దన్నా, పేరుతో పిలవండి” అని అంటారని చెప్పారు. అలా పేరుతో పిలిచినప్పుడు, పక్కన ఉన్న టీమ్ సభ్యులకు అది నచ్చక, తన పాత్రను తీసేసిన సంఘటనను వివరించారు. “ఒక దర్శకుడి తండ్రి పక్కన నుంచుని సిగరెట్ తాగినందుకు నా పాత్రను తీసేశారు. ఆయన డైరెక్టర్ తండ్రి అని నాకు తెలిస్తే నేను అక్కడ ఉండను కదా” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు తనకే కాకుండా చాలా మంది ఆర్టిస్టులకు ఎదురవుతాయని ఆయన అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
పరిశ్రమలో “భజన” సంస్కృతిపై చంటి తీవ్ర విమర్శలు చేశారు. “భజన కొట్టినంత సేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్. భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదు అనుకోరా నీ అంత గలీజ్ గాడు ఇంకోడు లేడు. ఇది ఆర్టిస్ట్ లైఫ్” అని ఆయన పేర్కొన్నారు. తమకు దిక్కు దర్శకులే అని, తమ జీవితం వారితోనే అని, తమను వజ్రంగా మార్చేది వారే అని, నంది అవార్డు, ఆస్కార్ కూడా వారే ఇస్తారని దర్శకులను పొగడాలని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
