AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వేలాది ఆవుల సాక్షిగా ఏడడుగులు.. ఈ జంట పెళ్లి ప్రత్యేకం!

పెళ్లి అనగానే కళ్లు చెదిరే అలంకరణలు.. లక్షల రూపాయల ఖర్చుతో మండపాలు.. గ్రాండ్ ఎంట్రీలు.. సంగీత్, డ్యాన్స్‌లు.. ఇలా ఎన్నో హంగులు గుర్తుకొస్తాయి. పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఓ యూట్యూబర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించింది. భారీ సెట్టింగులు, ఆర్భాటాలకు బదులుగా.. ఏకంగా 10 వేల ఆవుల మధ్య తన పెళ్లి ఏడడుగులు వేయాలని నిర్ణయించింది. ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఆ గోశాలకు ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటి?

Video: వేలాది ఆవుల సాక్షిగా ఏడడుగులు.. ఈ జంట పెళ్లి ప్రత్యేకం!
Couple Decide To Wed At Gaushala No Lavish Mandap Just 10000 Cows
Sharada V
|

Updated on: Nov 06, 2026 | 9:11 PM

Share

యూట్యూబర్ నిధి రాథోడ్ తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. సాధారణంగా పెళ్లిళ్లలో జైమాలా వేడుక ఎలా ఉండాలి? మండపాన్ని ఎంత అందంగా అలంకరించాలి? వధూవరుల ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉండాలి అన్న వాటిపై కుటుంబ సభ్యులు ఎంతో శ్రద్ధ పెడుతుంటారు. కానీ జీవితాంతం కలిసి నడుస్తామని ప్రమాణం చేసే అసలైన ఘట్టం పెళ్లి లో ఏడడుగుల గురించి పెద్దగా ఆలోచించరు అని నిధి అభిప్రాయపడింది.

అందుకే తమ పెళ్లిలో ఈ ముఖ్య ఘట్టానికి ప్రత్యేకత ఉండాలని భావించింది. ఎప్పుడూ చూసే అందమైన మండపంలో కాకుండా.. వేలాది గోవుల మధ్య, ప్రకృతి ఒడిలో తమ వివాహ ప్రమాణాలు చేయాలని ఈ జంట నిర్ణయించింది. దాదాపు 10 వేల ఆవులు ఉన్న గోశాలను తమ పెళ్లి వేదికగా ఎంచుకుంది.

తమ ప్రేమకథలో ఆ గోశాలకు ప్రత్యేక స్థానం!

నిధి ఈ గోశాలను ఎంచుకోవడం వెనుక ఆసక్తికర కారణం ఉంది. తనకు, కాబోయే భర్తకు వివాహం ఖరారైంది ఈ గోశాలలోనే. వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కూడా ఇక్కడే జరిగింది. ఇలా తమ బంధంలోని ముఖ్యమైన జ్ఞాపకాలన్నిటికీ ఈ ప్రదేశం వేదికగా నిలిచింది.

తమ జీవితంలో మరో కీలక ఘట్టమైన పెళ్లిని కూడా అక్కడే జరుపుకోవాలని నిర్ణయించారు. సాధువుల సమక్షంలో, వారి ఆశీర్వాదాలతో 10 వేల గోవుల మధ్య ఏడడుగులు వేయడం తమకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని నిధి చెప్పింది. ‘గోవుల మధ్య నుంచే మా ఇద్దరి జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామని ఇక్కడే ప్రమాణం చేసుకోబోతున్నాం’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

View this post on Instagram

A post shared by Nidhi Rathode (@ram_pyarii_)

గోశాలలోనే మొత్తం పెళ్లి చేయాలనుకున్న నిధి .. చివరకు!

మొదట తమ పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలను గోశాలలోనే నిర్వహించాలని ఈ జంట భావించిందట. అయితే పెళ్లి  రెండు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం. తమ పిల్లల పెళ్లి గురించి తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఆశలు, కలలు ఉంటాయి. పెళ్లిలో అత్యంత ముఖ్యమైన ఏడడుగుల వేడుకను గోశాలలో నిర్వహించి బంధుమిత్రుల కోసం విందును సమీపంలోని గార్డెన్‌లో ఏర్పాటు చేయనున్నారు. పగలు గోశాలలో పెళ్లి .. సాయంత్రం గార్డెన్‌లో రిసెప్షన్ జరగనుంది.

ప్రీ వెడ్డింగ్ షూట్‌లోనూ అదే ప్రత్యేకత!

వీరి పెళ్లి మాత్రమే కాదు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కూడా ప్రత్యేకమే. మోడలింగ్ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న నిధికి కెమెరా ముందుకు రావడం అలవాటే. కానీ ఈసారి అందరిలా ఒక సాధారణ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. తమ ఇద్దరి వ్యక్తిత్వాలు, అభిరుచులు, ప్రేమను ప్రతిబింబించేలా ఫొటోషూట్ చేయాలని కోరుకుంది.

తాను చలాకీగా ఉంటానని, అందరితో కలిసిపోతానని చెప్పిన నిధి.. తనకు కాబోయే భర్త  సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడని వెల్లడించింది. ఇద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నం.  తమ మధ్య అనుబంధాన్ని ఫొటోల్లో అందంగా చూపించాలనుకుంది. అందుకే గోశాల ఎంపిక నుంచి దుస్తుల రంగులు, ఫొటోషూట్ థీమ్ వరకు ఒక్కో ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ షూట్ కేవలం కొన్ని అందమైన ఫొటోల కోసం కాదని.. తమ ప్రేమకు, జీవితానికి అద్దం పట్టే జ్ఞాపకమని పేర్కొంది.

నెటిజన్లు ఫిదా.. ఇదో అందమైన ఆలోచన!

నిధి తన పెళ్లి నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. సాధారణ పెళ్లిళ్లకు భిన్నంగా ప్రత్యేకంగా ఆలోచన చేయడం బాగుందని ప్రశంసిస్తున్నారు.  ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పటివరకు చూసిన ప్రీ వెడ్డింగ్ షూట్లలో ఇదొక అందమైన కాన్సెప్ట్’, ‘మీ ఆలోచనా విధానం చాలా బాగుంది’, ‘మీ ఇద్దరి కొత్త జీవితం సంతోషంగా సాగాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us