AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రొమాంటిక్ సీన్లకు పేరెంట్స్ కండిషన్.. ఆఫర్స్ కోల్పోయిన హీరోయిన్.. కట్ చేస్తే..

పాన్ ఇండియా సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ మంచి హిట్స్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ హీరోయిన్.

Tollywood: రొమాంటిక్ సీన్లకు పేరెంట్స్ కండిషన్.. ఆఫర్స్ కోల్పోయిన హీరోయిన్.. కట్ చేస్తే..
Mrunal Thakur
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2025 | 10:31 AM

Share

బుల్లితెరపై ఓ సీరియల్లో చిన్న పాత్రతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ హిందీ చిత్రపరిశ్రమలో కథానాయికగా మారింది. తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ అమ్మడు.. అటు తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యింది. అయితే కెరీర్ తొలినాళ్లల్లో తన తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ వల్ల ఎన్నో సినిమా ఆఫర్స్ కోల్పోయానని తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… ? హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. 2022లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది.

కాలేజీ రోజుల్లోనే మరాఠీ సీరియల్లో నటించింది మృణాల్. ఆ తర్వాత హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంది. ఆ తర్వాత హలో నందన్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. రాహుల్ జాదవ్ దర్శకత్వం వహించిన మరాఠీ భాషా చిత్రంలో ఆమె కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో ఆఫర్స్ కోల్పోయిందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తాను ఎన్నో హిట్ మూవీస్ కోల్పోయానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

కెరీర్ తొలినాళ్లల్లో తాను రొమాంటిక్ సీన్లలో నటించనని తన తల్లిదండ్రులు షరతు పెట్టారని.. దీంతో తాను చాలా హిట్ మూవీస్ కోల్పోయానని తెలిపింది. నటి కావాలనే తన కల చెదిరిపోతుందనే భయంతో ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడి.. రొమాంటిక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం మృణాల్ పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సర్దార్ సన్ 2, తుమ్ హై తో , డకోయిట్: ఎ లవ్ స్టోరీ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘డగోయిట్: ఎ లవ్ స్టోరీ’ చిత్రంలో యాక్షన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట్లో ఈ సినిమాలో నటి శ్రుతి హాసన్ నటించాల్సి ఉంది. కానీ కొన్ని సమస్యల కారణంగా ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us
రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?
రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?
FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి
FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి
ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..
శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..
ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి
ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి
శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే
శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే
దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన
దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!