Tollywood: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సినీరంగంలో కొనసాగుతున్న హీరోయిన్స్ ఒకప్పుడు నచ్చిన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్నవాళ్లే. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. ఇప్పుడు తమ కలలను నిజం చేసుకుంటూ నచ్చిన దారిలో దూసుకెళ్తున్న హీరోయిన్స్ గురించి తెలుసా.. ?

Tollywood: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Nivetha Pethuraj

Updated on: Mar 08, 2025 | 12:33 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న తారను గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అందం, అభినయంతో కట్టిపడేసింది. అయితే ఇప్పుడు కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె.. అటు ఫార్ములా కార్ రేసింగ్ లో దూసుకెళ్లాలని అనుకుంది. అందుకోసం ప్రత్యేక శిక్షణ సైతం తీసుకుంది. ఇప్పటికే పలు పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. అటు నటిగా.. ఇటు కార్ రేసింగ్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ… బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? కొన్నాళ్లుగా తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా పేతురాజ్.

నివేదా పేతురాజ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. తమిళనాడులోని మధురైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి పదేళ్లు దుబాయ్ లో చదువుకుంది. ఆ తర్వాత మోడలింగ్ పై ఆసక్తితో మిస్ ఇండియా యూఏఈ పోటీల్లో పాల్గొని టైటిల్ గెలిచింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లోనూ సత్తా చాటింది. ఆ తర్వాత మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారికి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టిక్ టిక్ టిక్, చిత్రల హరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురం, రెడ్, పాగల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె నటించిన చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

కానీ ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. కొన్ని రోజులుగా సరైన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇటీవలే బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని విన్నర్ గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట షేర్ చేయగా.. ఫ్యాన్స్ షాకవుతున్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..