Director Sukumar: డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని.. ఎవరో తెలుసా..
డైరెక్టర్ సుకుమార్ ఇటీవలే పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఆర్య సినిమాతో దర్శకుడిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు పుష్ప 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. క్రియేటివ్ జీనియస్ అంటూ అభిమానులు పిలుచుకునే దర్శకుడు ఆయన. తొలి సినిమాతోనే దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని అందరి ప్రశంసలు పొందుతున్నారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు సుకుమార్. మరోవైపు ఆయన శిష్యులు సైతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. మొదటి సినిమాలకే భారీ విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈరోజు డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సుకుమార్ ఏ హీరో స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చారో తెలుసా..? ఆ హీరో మరెవరో కాదు. సీనియర్ హీరో రాజశేఖర్. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. చిన్నతనంలో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసేవారని తెలిపారు. ఆయన నటించిన ఆహుతి, ఆగ్రహం, అంకుశం, తలంబ్రాలు, మగాడు వంటి చిత్రాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. చదువుకొనే రోజుల్లో ఆయనను ఇమిటేట్ చేస్తుండేవాడినని.. నా పెర్ఫార్మెన్స్ మచె్చి అందరూ వన్స్ మోర్ అనేవారని.. అలా ఫేమస్ అయిపోయానని చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి వెళ్లి ఏదైన చేయగలిగే నమ్మకం కలిగేందుకు అప్పుడు తనకు రాజశేఖరే కారణమయ్యారని చెప్పుకొచ్చారు.
ఆర్య సినిమాతో దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు సుకుమార్. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సుకుమార్ రూపొందించిన పుష్ప 2 సినిమా ఇప్పటివరకు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సెట్ చేసింది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..