Thandel: వార్నీ.. తండేల్ సినిమాకు నాగచైతన్య రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.. మరీ ఇంత తక్కువా.. ?
ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ తండేల్. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వైజాగ్, హైదరాబాద్, ముంబై, చెన్నై ప్రాంతాల్లో తండేల్ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించింది చిత్రయూనిట్.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ తండేల్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. అలాగే ఇందులో చైతూ జోడిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తర్వాత చైతూ, సాయి పల్లవి కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అమీర్ ఖాన్ అతిథిగా ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తండేల్ సినిమా కోసం చైతన్య తీసుకునే రెమ్యునరేషన్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. తండేల్ సినిమా కోసం చైతూ రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. గతంలో తన సినిమా కోసం రూ.10 కోట్లు తీసుకుంటున్న చైతూ.. ఇప్పుడు తండేల్ కోసం పదిహేను కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.
కేవలం కమర్షియల్ సక్సెస్ చిత్రాలు కాకుండా విభిన్నమైన కంటెంట్, బలమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు చైతూ. దేశభక్తి, భావోద్వేగాలతో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన