AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Love Story: థియేటర్లను ఊపేసిన చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ.. రిలీజ్ ఎప్పుడంటే..

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. జూలై 24న విడుదలైన ఈ మూవీకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.38 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Chennai Love Story: థియేటర్లను ఊపేసిన చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ.. రిలీజ్ ఎప్పుడంటే..
Chennai Love Story Movie
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2026 | 7:25 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న కంటెంట్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. అటు హీరోగా.. ఇటు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్, విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడింది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విడుదల ముందే రూ. 15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. థియేటర్లలో విడుదలయ్యాక విశేష ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ. 38.30 కోట్ల గ్రాస్, రూ. 22.28 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లోనూ రూ. 7 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్, రూ. 27 కోట్లకు పైగా షేర్ సాధించి ‘డబుల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు రూ. 15 కోట్లకు పైగా నికర లాభాలను అందించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. థియేట్రికల్ రన్‌తో పాటు శాటిలైట్, డబ్బింగ్, మ్యూజిక్ రైట్స్ ద్వారా కూడా మంచి ఆదాయం సమకూరింది. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ చిత్రం డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఈ సినిమా డిజిటల్ హక్కులను ఊహించని విధంగా సోనీ లివ్ దక్కించుకోవడం విశేషం. సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఆగస్ట్ 21న సోనీ లివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us